Moviesబిగ్ సర్ప్రైజ్: ఆచార్యలో కాజల్ సీన్స్ యాడ్ చేస్తున్నారోచ్..అందుకోసమేనా.?

బిగ్ సర్ప్రైజ్: ఆచార్యలో కాజల్ సీన్స్ యాడ్ చేస్తున్నారోచ్..అందుకోసమేనా.?

యస్..తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే..ఈ వార్త నీజ్మే అనిపిస్తుంది. టాలీవుడ్ చందమామ కాజల్ నటించిన సీన్స్ ని ఆచార్య సినిమాలో యాడ్ చేస్తున్నారట. దానికి కారణం లేకపోనూలేదు..కొరటాల ముందు కమిట్ అయిన డీల్ ప్రకారం..కాజల్ సీన్స్ యాడ్ చేయకతప్పడం లేదట. మనకు తెలిసిందే మెగాస్టార్ ప్రధాన పాత్రలో..ఆయన తనయుడు రామ్ చరణ్..అతిధి పాత్రలో నటించిన సినిమా “ఆచార్య”.

ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. గత ట్రాక్ రికార్డులు బట్టి చూస్తే ఆచార్య బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. కానీ, అలా జరగలేదు. సినిమా దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తద్వారా కెరీర్ లో ఫస్ట్ టైం ఫ్లాప్ ను రుచి చూశాడు కొరటాల శివ. ఆ టైంలో కొరటాల పై దారుణం గా మాట్లాడారు. కొందరు అయితే, కాజల్ ని హీరోయిన్ గా పెట్టి..ఆమె తో కొన్ని షూట్స్ తీసి..తీరా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగానే..సినిమా నుండి తీసేశావు ..ఈ శాపమే నీకు ఫ్లాప్ ఇచ్చింది అంటూ తిట్టిపోశారు.

అయితే, సినిమా కూడా దారుణ నష్టాలను చవిచూసింది. ఇప్పటికి ఆచార్య డిస్ట్రీబ్యూటర్స్ నష్టాల్లోనే ఉన్నారు. కొరటాల కూడా కొంచెం వాళ్లని ఆదుకున్నా..ఇంకా బిగ్ అమౌట్ పెండింగ్ లో ఉంది. అయితే, ఈ డబ్బును చిరంజీవి, చరణ్..ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా, ఈ మధ్య ఓట్ట్ లో రిలీజ్ అయ్యి..అక్కడ ఫ్లాప్ అయిన ఆచార్య…ఇప్పుడు బుల్లితెర పై రాబోతుందట. అయితే, సినిమాలో కాజల్‌ రోల్‌ లేకపోవడంతో ఇప్పుడు శాటిలైట్‌ ఇబ్బందులు తలెత్తాయని.. ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్‌ ఛానెల్‌కి భారీ ధరకి ఈ చిత్ర శాటిలైట్‌ హక్కులు ముందే అమ్మేసిన కొరటాల అప్పుడు అగ్రీమెంట్ లో కాజల్ పేరు ఉందని,,ఇప్పుడు ఆమె సీన్స్ లేకపోతే ఎలా..అంటూ నిలదీశారట.

దీంతో సదరు టీవీ ఛానెల్‌ సినిమాని ప్రదర్శించేందుకు నిరాకరిస్తుందని టాక్ వినిపిస్తుంది. సినిమాలో కాజల్ సీన్స్ అయినా యాడ్ చేయండి..లేదా మాట్లాడుకున్న డీల్ లో సగం కట్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారట. అసలే నష్టాల్లో ఉన్న ఆచార్య కు ఇది ఇప్పుడు పెద్ద బొక్క అవుతుందని భావించిన కొరటాల సినిమాలో కాజల్ సీన్స్ యాడ్ చేయడానికి ఒప్పుకున్నారట. మరి చూడాలి బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news