Moviesలంగా జాకెట్ లో రెచ్చిపోయిన అంజలి..మరో హాట్ ఐటెం సాంగ్ కు...

లంగా జాకెట్ లో రెచ్చిపోయిన అంజలి..మరో హాట్ ఐటెం సాంగ్ కు “సై”..!!

ఈ మధ్య కాలంలో సినిమాలో స్టార్ హీరోయిన్స్ అందరు..ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క పాట కి సినిమా హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇస్తుండటం కారణంగా కావచ్చు..లేక, పాపులారిటీ వస్తుంది అని కావచ్చు..కారణం ఎదైనప్పటికి హీరోయిన్స్ ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు.

ఇప్పటికే ఈ లిస్ట్ లో చాలా మంది హాట్ హీరోయిన్స్ ఉన్నారు. కాజల్, తమన్నా, పూజా హెగ్డే, సమంత..అందరు ఉన్నారు. ఇక ఆ లిస్ట్ లో అంజలీ కూడా ఉంది. తెలుగు అమ్మాయి అయినప్పటికి కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ..తెలుగు లో సినిమా అవకాశాలు అందుకుంది. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న ఋఛ్15 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అంజలి కెరీర్ లో ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. అయితే రీసెంట్ గా అంజలి మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడ్డింది. ఇప్పటికే సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ తో హాట్ స్టెప్పులేసి మెప్పించిన ఈ బ్యూటీ..ఇప్పుడు మరోసారి తనలో హాట్ ఐటెం గర్లని బయటకు రప్పిస్తుంది.

యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అంజలి ఓ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అందులో అంజలి హాట్‌ ఫోజుతో కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news