Moviesకుక్క‌కు కూడా ఫ్లైట్ టిక్కెట్.. ర‌ష్మిక డిమాండ్ల‌తో నిర్మాత బెంబేలు...!

కుక్క‌కు కూడా ఫ్లైట్ టిక్కెట్.. ర‌ష్మిక డిమాండ్ల‌తో నిర్మాత బెంబేలు…!

కన్నడ కస్తూరి రష్మిక ప్రస్తుతం ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ.. అటు బాలీవుడ్ లోనూ దుమ్ము రేపుతోంది. కన్నడంలో కిరాక్ పార్టీ అనే చిన్న సినిమాతో హిట్ కొట్టిన రష్మిక తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ఛ‌లో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఛ‌లో హిట్ అయ్యాక రష్మికకు తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కట్టాయి. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు ..బన్నీ పుష్ప లాంటి సూపర్ డూపర్ హిట్లు పడడంతో ఇప్పుడు రష్మిక తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

అటు కోలీవుడ్‌లో విజయ్‌కి జోడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంది. ఛ‌లో సినిమాకు 25 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తేనే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని సంతోషపడిన రష్మిక… ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా యూత్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ర‌ష్మిక అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత‌లు కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

అస‌లే తెలుగు నిర్మాత‌లు మొహ‌మాట‌స్తులు. ఎవ‌రు ఏం అడిగినా కాద‌న‌కుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మాధ్య పూజా హెగ్డే త‌మిళంలో బీస్ట్ సినిమా కోసం ముంబై నుంచి త‌న హెయిర్ డ్రెస్స‌ర్లు, స్టైలీస్ట్ డిజైన‌ర్లను కూడా వెంట తెచ్చుకుంద‌ట‌. అయితే నిర్మాత చివ‌ర్లో వాళ్ల బిల్లు క‌ట్ చేసి బ్యాలెన్స్ ఆమె చేతిలో పెడితే అవాక్క‌వ్వ‌డంతో పాటు తెలుగు నిర్మాత‌లే బెట‌ర్ క‌దా.. ఏం అడిగినా కాద‌న‌రు అని వాపోయింద‌ట‌.

క‌రెక్టుగా తెలుగు నిర్మాత‌ల బ‌ల‌హీన‌త‌ల‌ను క్యాష్ చేసుకుంటో ర‌ష్మిక ఇప్పుడు త‌న వెంట త‌న కుక్క‌ను కూడా షూటింగ్‌కు తెచ్చుకుంటాన‌ని అంటోంద‌ట‌. అయితే ఫ్లైట్‌లో త‌న‌తో పాటు దానికి కూడా టిక్కెట్లు తీయాల‌న్న కండీష‌న్లు పెడుతుంద‌న్న ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. దీంతో నిర్మాత‌లు ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే బెంబేలెత్తుతున్నార‌ట‌. దీనిపై సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గీతా కృష్ణ ఘాటుగా స్పందించారు. అగ్రిమెంట్లో కుక్క‌కు ఫ్లైట్ టిక్కెట్ తీయాల‌ని ఉండ‌ద‌ని.. ఫైన‌ల్‌గా ఈ ఖ‌ర్చులు అన్నీ ఆమె రెమ్యున‌రేష‌న్ నుంచి క‌ట్ చేసి ఇస్తే స‌రిపోతుంద‌ని చెప్పారు.

గ‌తంలో తాను త‌మ‌న్నాతో ఓ యాడ్ డిజైన్ చేసిన‌ప్పుడు ఆమె కూడా త‌న ఇంట్లో ప‌నిమ‌నిషిని తెచ్చుకుంద‌ని.. అయితే ఆమెకు ఇచ్చే రెమ్యున‌రేష‌న్లో రు. 20 వేలు క‌ట్ చేసి ఇచ్చాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత త‌మ‌న్నా తండ్రి ఫోన్ చేసి అడిగినా తాను ఘాటు కౌంట‌ర్ ఇచ్చాన‌ని చెప్పారు. త‌ర్వాత ఇదే విష‌య‌మై త‌న తండ్రి ఫోన్ చేసినందుకు త‌మ‌న్నా సారీ చెప్పింద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఏదేమైనా ర‌ష్మిక వ్య‌వ‌హారం.. ఇప్పుడు గీతాకృష్ణ వ్యాఖ్య‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news