Moviesఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్ట్..!

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్ట్..!

విజయ్ దేవరకొండ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకున్న టాలెంట్ ను బయట పెడుతూ.. ఇండస్ట్రీలో ఇప్పుడూ స్టార్ హీరోగా రాజ్యమేలుతున్నాదు. పెళ్లి చూపులు సినిమాలో సైలెంట్ బాయ్ గా కనిపించిన ఈ హీరో..అర్జున్ రెడ్డి సినిమాలో మాత్రం లిప్ కిస్ ల తో రెచ్చిపోయి..యువతను తన వైపు తిప్పుకున్నారు.

ప్రజెంట్ ఈ హీరో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో “లైగర్” అనే మూవీ చేశాడు. పాన్ ఇండియా స్దాయిలో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. లైగర్’ చిత్రాన్ని 2022 ఆగస్టు 25న హిందీ తెలుగు తమిళం కన్నడ మరియు మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ కలసి సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాధ్ – ఛార్మీ కౌర్ – కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే, కొద్దిసేప్పటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. లైగర్ సినిమా నుంచి ఓ పోస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో విజయ న్యూడ్ లుక్‌లో కనిపించాదు. అమీర్ ఖాన్ పీకే సినిమాలోని స్టిల్‌లో విజయ్ దేవరకొండ కనిపించడం విశేషం. ఆయన రాసుకోస్తూ..”ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, శారీరకంగా మానసికంగా ధృడంగా తయారయ్యానని” చెప్పుకొచ్చాదు.విజయ్ న్యూడ్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news