Moviesఅత‌డితో రిలేష‌న్ వ‌ల్లే ' జ‌బ‌ర్ద‌స్త్ స‌త్య శ్రీ ' షాకింగ్...

అత‌డితో రిలేష‌న్ వ‌ల్లే ‘ జ‌బ‌ర్ద‌స్త్ స‌త్య శ్రీ ‘ షాకింగ్ డెసిష‌న్ తీసుకుందా…!

ఈటీవీలో ప్ర‌సారం అయ్యే మ‌ల్లెమాల వారి జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ బుల్లితెర‌పై ఎంత పాపుల‌ర్ షోనో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది త‌మ టాలెంట్ ప్ర‌ద‌ర్శించుకునే అవ‌కాశం ద‌క్కింది. జ‌బ‌ర్దస్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు సినిమాల్లో రైట‌ర్లుగాను, హీరోలుగాను, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా కూడా స‌క్సెస్ అయ్యారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోలో లేడీ గెట‌ప్‌ల ద్వారా ఎంతో మంది పాపుల‌ర్ అయ్యారు. ఈ లిస్టులో వినోద్‌, ప‌వ‌న్‌, తేజ‌, శాంతికి మంచి గుర్తింపు వ‌చ్చింది.

ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్‌లో లేడీ క‌మెడియ‌న్‌గా బాగా పాపుల‌ర్ అయ్యింది స‌త్య‌శ్రీ. స‌త్య శ్రీ కామెడి స్కిట్ల‌కు ప్రేక్ష‌కులు పొట్టు చెక్క‌ల‌య్యేలా నువ్వేవాళ్లు. చ‌మ్మ‌క్ చంద్ర టీంలో ఆమె బాగా పాపుల‌ర్ అయ్యింది. రీసెంట్‌గా ఆమె జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆమె షో నుంచి ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? అస‌లేం జ‌రిగింది ? అన్న‌దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఈ షోలో చ‌మ్మ‌క్ చంద్ర‌, వినోద్ మంచి ఫెయిర్‌గా ఉండేవాళ్లు. వినోద్ షో వీడి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో ఫ్యామిలీ స్కిట్లు చేసే చంద్ర‌కు జోడీగా స‌త్య బాగా క్లిక్ అయ్యింది. ఈ జంట స్కిట్ అంటే ఫ్యామిలీ ప్రేక్ష‌కులు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్లు. నాగ‌బాబు షో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు స‌త్య కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. దీంతో స‌హ‌జంగానే రూమ‌ర్లు వ‌చ్చాయి. చ‌మ్మ‌క్ చంద్ర‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్లే స‌త్య జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దులుకుంద‌నే చాలా మంది అనుకున్నారు.

దీనిపై క్లారిటీ ఇచ్చిన స‌త్య తాను ఈ షోలో న‌టించ‌డానికి త‌న గురువు చ‌మ్మ‌క్ చంద్రే అని.. ఆయ‌నే ఇక్క‌డ లేన‌ప్పుడు తాను ఎందుకు అని ? త‌న‌తో పాటు టీం అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ని చెప్పింది. ప్ర‌స్తుతం చంద్ర సినిమాల్లో బిజీగా ఉండ‌డంతో తాను ధ‌న్‌రాజ్ టీంలో కొన్ని ప్రోగ్రామ్స్‌లో చేస్తున్న‌ట్టు చెప్పింది. ఇక చంద్ర – స‌త్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యేది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే రూమ‌ర్ల‌పై కూడా స‌త్య క్లారిటీ ఇచ్చింది.

మా గురువు గారు.. నా మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అవుతుందని.. ఇలాంటి రూమ‌ర్లు సినిమా వాళ్ల‌కే వ‌స్తాయ‌ని.. ఇక మేం ఎంత అని కూడా చెప్పింది. మా నాన్న నాకు ఆ వీడియోలు చూపించిన‌ప్పుడు ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ మానేయ‌మ‌ని అంటారేమోన‌ని త‌న‌కు చాలా భ‌యం వేసింద‌ని.. అయితే ఆయ‌న మాత్రం నువ్వు ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకుంటున్నావు.. ఇవేవి ప‌ట్టించుకోకు అని ధైర్యం చెప్పార‌ని స‌త్య చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news