Moviesబ్రేకింగ్‌: హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు.. చెన్నై కావేరిలో చికిత్స‌.. తీవ్ర ఆందోళ‌న‌లో...

బ్రేకింగ్‌: హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు.. చెన్నై కావేరిలో చికిత్స‌.. తీవ్ర ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌…!

కోలీవుడ్ సీనియ‌ర్ హీరో, ప్ర‌ముఖ న‌టుడు చియాన్ విక్ర‌మ్ ఈ రోజు తీవ్ర‌మైన గుండెపోటు రావ‌డంతో చెన్నై కావేరి ఆసుప‌త్రిలో చేరారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు బాగానే ఉన్న ఆయ‌న ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను చెన్నైలోని కావేరి హాస్ప‌ట‌ల్లో చేర్పించారు. ప్ర‌స్తుతం అయితే వైద్యులు విక్ర‌మ్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం విక్ర‌మ్‌కు తీవ్ర‌మైన గుండెపోటు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

వైద్యులు కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెపుతున్నా కూడా ఆయ‌న పూర్తి ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. మ‌రోవైపు ఆయ‌న అభిమానులు మాత్రం విక్ర‌మ్ పూర్తిగా కోలుకుని త్వ‌ర‌గా తిరిగి రావాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కోబ్రా సినిమాలో న‌టించారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌మిళ‌నాడు ఏరియా రైట్స్‌ను సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఎమ్మెల్యే ఉద‌య‌నిధి స్టాలిన్ సొంతం చేసుకున్నారు.

ఇక మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలోనూ విక్ర‌మ్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ లాంఛ్ ఈ రోజు చెన్నైలో సాయంత్రం 6 గంట‌ల‌కు జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రెడీ అవుతున్నారు. ఈ లోగానే ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఏదేమైనా వైద్యులు విక్ర‌మ్ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే వ‌ర‌కు ఈ టెన్ష‌న్ త‌ప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news