Moviesబాల‌య్య - ఎన్టీఆర్ - క‌ళ్యాణ్‌రామ్.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్‌...!

బాల‌య్య – ఎన్టీఆర్ – క‌ళ్యాణ్‌రామ్.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్‌…!

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న బింబిసార ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ళ్యాణ్‌రామ్ నుంచి చాలా రోజుల త‌ర్వాత సినిమా వ‌స్తుండ‌డంతో పాటు బింబిసార క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా ఉండ‌డం, ఇటు ఈ సినిమా ట్రైల‌ర్‌కు కూడా పాజిటివ్ బ‌జ్ ఉండ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంద‌న్న చ‌ర్చ‌లు ట్రేడ్ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి. సినిమా పిక్చ‌రైజేష‌న్ ఓ రేంజ్‌లో అయితే ఉంది. ఈ సినిమాకు వ‌శిష్ట్ మ‌ల్లిడి అనే కొత్త ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

క‌ళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథ‌రిన్ థెస్రా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. మ‌గ‌ధ సామ్రాజ్యాధినేత బింబిసారుడుకు ఈ త‌రం జ‌న‌రేష‌న్లో మ‌రో వ్య‌క్తికి లింక్ పెట్టి ఈ క‌థ‌నం న‌డుస్తుంది. సినిమాలు రెండు పాత్ర‌లు వేటిక‌వే వైవిధ్యంగా ఉంటాయ‌ని.. సినిమా పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో న‌డుస్తుంద‌ని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – బాల‌య్య క‌ల‌వ‌బోతున్న‌ట్టు కూడా తెలుస్తోంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ – బాల‌య్య క‌ల‌వ‌డం జ‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలోనే బింబిసార ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ కోసం ఎన్టీఆర్ – బాల‌య్య ఒకే వేదిక పంచుకోనున్నార‌ట‌. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే పాజిటివ్ ప్ర‌చారం స్టార్ట్ చేసేశారు.

ఎప్పుడూ లేనంతగా బాల‌య్య అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో బింబిసార‌కు పాజిటివ్‌గా పోస్టులు పెడుతూ ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. గ‌తంలో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ సినిమా విష‌యంలోనే ఈ రేంజ్‌లో బ‌జ్ వ‌చ్చింది. అప్పుడు కూడా జాన‌కీరామ్ మృతి చెంద‌డంతో నంద‌మూరి అభిమానులు అంద‌రూ ఏకం అయ్యి ప‌టాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో త‌మ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు బింబిసార విష‌యంలో అదే సీన్ రిపీట్ అవుతోంది. ఏదేమైనా నంద‌మూరి హీరోలు ముగ్గురు ఒకే వేదిక‌మీద క‌నిపిస్తే ఫ్యాన్స్‌కు అంత‌కు మించిన ఆనందం ఏం ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news