Moviesఐటెం సాంగ్ కోసం అంజలి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ .. హీరోయిన్...

ఐటెం సాంగ్ కోసం అంజలి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ .. హీరోయిన్ కన్నా ఎక్కువే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసిన రా రా రెడ్డి అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ నే వినిపిస్తుంది. మనకు తెలిసిందే..నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సినిమా పేర్లోనే ఓ కొత్త హైప్ తీసుకొచ్చారు డైరెక్టర్. ఈ సినిమాతోనే రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, అప్ డేట్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది.

ఈ సినిమాలో నితిన్ పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు . లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి ..అందాల తార కేథరిన్‌ థ్రెస్సా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ లని స్టార్ట్ చేసిన..మేకర్స్..రీసెంట్ గా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి ఓ ఐటెం పాటను రిలీజ్ చేశారు. రా రా రెడ్డి అంటూ సాగే ఈ పాట్ ఫుల్ మాస్ బీట్ తో అద్దిరిపోయే ఉంది.

మంచి ఊపునిస్తున్న ఈ పాటలో తెలుగు అమ్మాయి అంజలి స్టెప్స్ యమ హాట్ గా ఉన్నాయి. అంజలి ఈ రేంజ్ అందాలను మనం ఇది వరకు చూసి ఉందం. అలా హాట్ గా కుర్రాళ్ళకు లంగా , జాకెట్ తో కిక్కెక్కిస్తుంది అంజలి. నిజానికి అంజలి చేతిలో ఇప్పుడు బడా సినిమాలు ఉన్నాయి. చరణ్ పక్కన హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీ చేస్తుంది.

మరి అంత బిజీ గా ఉన్న హీరోయిన్..చిన్న హీరో సినిమాలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందా అని ఆరా తీస్తే..అసలు విషయం బయటపడ్డింది. ఈ పాట కోసం కెరీర్ లో నే ఎప్పుడు లేనంత విధంగా దాదాపు కోటీ 70 లక్షలు..పారితోషకంగా పుచ్చుకుందట అంజలి. నితిన్ స్వయంగా కాల్ చేసి..అడగటంతోనే అంజలి ఈ మాస్ పాట చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్ ని ఓ ఊపు ఊపేస్తుంది. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news