Moviesపూజా తల తిక్క నిర్ణయం..రష్మిక హ్యాపీ..భలేగుంది బాసూ..?

పూజా తల తిక్క నిర్ణయం..రష్మిక హ్యాపీ..భలేగుంది బాసూ..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. హీరో గా ఉన్న వాళ్ళు జీరో..జీరో గా ఉన్న వాళ్లు హీరో అవుతుంటారు. ఇక ఇప్పుడు అలాగే చేస్తుంది పూజా హెగ్డే. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. వరుస సినిమా అవకాశాలతో దుమ్ము దులిపేస్తుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలతో ఫ్లాప్ కొట్టిన..ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసుకున్న..అవకాశాలు మాత్రం పుష్కలంగా వస్తున్నాయి.

దీంతో పూజా పాప..దిక్క తోచక తల తిక్క నిర్ణయాలు తీసుకుంటుంది అన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినిమా నుండి తప్పుకుని పెద్ద తప్పు చేసిందనే టాక్ బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండా జనగణమన సినిమా కోసమే అమ్మడు పవన్ భవదీయుడు భగత్ సింగ్ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో హాట్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

పూజా హెగ్డే వదులుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్ కు..మరో స్టార్ హీరోయిన్ సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్..భవదీయుడు భగత్ సింగ్ కోసం రష్మిక ను ఎంచుకున్నారట. పూజా హెగ్డే వదులుకున్న ఈ బిగ్ ఆఫర్ కి..రష్మిక ఓకే చెప్పిన్నట్లు తెలుస్తుంది. మొదట నుండి రష్మిక చాలా తెలివైనది..మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుంటూ..కెరీర్ లో ముందుకు వెళ్తుంది. బిజీగా ఉన్నా కానీ, పవన్ సినిమా కావడంతో కాల్ షీట్లు అడ్జెస్ట్ చేసి మరీ ఈ సినిమాకు ఓకె చెప్పిందట. దీంతో పవన్ ఫ్యాన్స్ అమ్మడుని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news