Moviesఇండస్ట్రీని షేక్ చేసిన హీరో తో పూజా హెగ్డే రొమాన్స్‌..సెంటిమెంట్ బ్రేక్...

ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో తో పూజా హెగ్డే రొమాన్స్‌..సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా..?

టాలీవుడ్ బుట్ట బోమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా కానీ, అందరు అమ్మడునే కావాలని కొరుకుంటున్నారు. దానికి ఏకైక రీజన్ పూజా అందాలే. చూసేకొద్ది చూడాలి అనిపించే కొత్త అందాలు పూజా లో చాలానే ఉన్నాయి. వరుస గా ముగ్గురు బడా స్టార్స్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నప్పుడు అమ్మడు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసింది. సినిమాలు హిట్ అయ్యుంటే..నిజంగా అమ్మడు దశ తిరిగిపోయుండేది.

కానీ, మూడు సినిమా లు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో పూజా కి మళ్ళీ ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. కానీ అమ్మడు కి మాత్రం ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్లను పట్టుకుని ఉన్న ఈ అమ్మడు..తాజా గా కెరీర్ ని ఊపు అందించే సినిమాకి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పూజా మరో పాన్ ఇండియా సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

KGF1,KGF 2లతో ఇండస్ట్రీ లెక్కలని మార్చేసిన హీరో యాశ్ తో పూజా రోమాన్స్ చేస్తుందా..అంటే, అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. నర్తన్ అనే దర్శకుడితో యష్ తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముప్తీ’ సూపర్ హిట్‌గా నిలవడంతో..ఇప్పుదు ఈ కాంబో పై భారీస్దాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు.

అయితే, ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెని కలిసి స్క్రిప్ట్ వివరించగా..ఆమె సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తుంది. కాల్ షీట్స్ లేకపోయినా పాన్ ఇండియా స్టార్ యష్ అవడంతో పూజా ఒకే చెప్పిందట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రానున్నట్టు సమాచారం. ఒక్కవేళ పూజా మళ్లీ సినిమా హిట్ కొడితే ఐరెన్ లెగ్ అనే ముద్రకు బ్రేక్ పడిన్నట్లే

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news