Moviesఅప్పుడు రజినికాంత్..ఇప్పుడు బాలయ్య..అద్దిరిపోలా..!!

అప్పుడు రజినికాంత్..ఇప్పుడు బాలయ్య..అద్దిరిపోలా..!!

కొద్ది గంటల ముందే బాలయ్య బర్తడే ట్రీట్ ను అందించారు డైరెక్టర్ గోఫీచంద్ మల్లినేని. NBK 107 సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసారు. ఆ టీజర్ చూసిన అభిమానులు అంతా ఒక్కటే మాట..జై బాలయ్య అంటూ అరుపులు కేకలతో హోరెత్తిస్తున్నారు. బాలయ్యను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో..ఫ్యాన్స్ ఎలా బాలయ్యను చూస్తే పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతారు..సేమ్ ఆ నాడి పట్టేసిన గోపీచంద్..NBK 107 లో అభిమానుల ఆకలి తీర్చేసాడు.

బాలయ్య నోటి నుండి వస్తున్న ఒక్కో మాస్ డైలాగ్ వింటుంటే..ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఊర మాస్ డైలాగ్..” నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా” అనే పవర్ ఫుల్ డైలాగ్స్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో ఈ సీన్ ఏమనుకుని రాశారో కానీ.. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం..ఇది ఆయన రాజకీయ ప్రత్యర్ధుల పై వేసిన పంచ్ అని చెప్పుకొస్తున్నారు. ఓవర్ ఆల్ గా బాలయ్య ఫ్యాన్స్ ని అలరించే నాన్ స్టాప్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలకు ఈ మూవీలో కొదవుండదని టీజర్ ను చూస్తుంటేనే తెలుస్తుంది.

అయితే, ఈ సినిమాలో బాలయ్య లుక్స్ చూసిన అభిమానులు..కోలీవుడ్ లెజండ్ హీరో రజినీకాంత్ ను గుర్తు చేసుకుంటున్నారు. రజినీ కాంత్ నటించిన ‘కాలా’ సినిమాలో సేమ్ రజనీ ఇలా బ్లాక్ షర్ట్ తో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తాడు . ముంబై మాఫియా నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో రజినీ గెటప్ అచ్చం..ఇప్పుడు బాలయ్య 107 లో లానే ఉంటుంది.

అంతేకాదు..ఆ చుట్ట అలా గాల్లోకి ఎగరేసి నోట్లో పెట్టుకోవడం రజినీ స్టైల్..ఇప్పుడు బాలయ్య ను అలా చూసేసరికి రజినీ ఫ్యాన్స్ కూడా బాలయ్య స్టైల్ ను లైక్ చేస్తున్నారు. దీంతో బాలయ్య , రజినీ కాంత్ ఫోటోలని మిక్స్ చేసి ..ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news