Moviesబాల‌య్య అభిమానికి మ‌హేష్‌తో సినిమా ఛాన్స్‌...!

బాల‌య్య అభిమానికి మ‌హేష్‌తో సినిమా ఛాన్స్‌…!

ఈ రోజుల్లో ఏ ద‌ర్శ‌కుడు అయినా ఓ సూప‌ర్ హిట్ సినిమా ఇచ్చాడంటే చాలు పెద్ద హీరోల క‌ళ్ల‌ల్లో ప‌డిప‌తున్నాడు. ప‌ర‌శురాం గీత‌గోవిందం చేశాడో లేదో కాస్త టైం ప‌ట్టినా ఏకంగా మ‌హేష్‌బాబును స‌ర్కారు వారి పాట సినిమాతో డైరెక్ట్ చేసేశాడు. అనిల్ రావిపూడి వ‌రుస హిట్ల‌తో ఇప్పుడు ఏకంగా బాల‌య్య‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక అప్పుడ‌ప్పుడు .. గుర్తొచ్చిన‌ప్పుడు మాత్ర‌మే హిట్లు ఇచ్చుకుంటూ వ‌స్తోన్న డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ గ‌తేడాది ర‌వితేజ‌తో క్రాక్ సినిమాతో ఓ ఊర‌మాస్ హిట్ కొట్టేశాడు.

వెంట‌నే మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లో బాల‌య్య‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం కొట్టేశాడు. అఖండ లాంటి బాల‌య్య కెరీర్ హిట్ త‌ర్వాత సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇంతకు అన్న‌ట్టు మ‌లినేని గోపీచంద్ స్వ‌స్థ‌లం ఒంగోలు. ఆయ‌న బాల‌య్య‌కు స్వ‌త‌హాగా వీరాభిమాని. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా టైంలో బ్లాక్ టిక్కెట్లు కొంటుండ‌గా పోలీసులు మ‌లినేనిని తీసుకువెళ్లి పోలీస్ స్టేష‌న్లో ఓ రోజంతా ఉంచార‌ట‌.

అలాంటి గోపీకి ఈ రోజు త‌న అభిమాన హీరోనే డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌డు. మొత్తానికి క్రాక్ లాంటి ఊర‌మాస్ హిట్ త‌ర్వాత గోపీచంద్‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు వెయిటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు బాల‌య్య 107ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను హిట్ చేస్తే వెంట‌నే గోపీకి మ‌హేష్‌బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తామ‌ని మైత్రీ వాళ్లు ప్రామీస్ చేశార‌ట‌.

ఇప్ప‌టికే బాల‌య్య సినిమాకు సంబంధించి చిన్న టీజ‌ర్ మాత్ర‌మే వ‌దిలారు. సినిమా బాగా వ‌స్తోంద‌ని.. ఖ‌చ్చితంగా బాల‌య్య‌కు మ‌రో సూప‌ర్ హిట్ ప‌డ‌బోతోంద‌న్న టాక్ మాత్రం వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా రిజ‌ల్ట్‌పై మైత్రీ మూవీస్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అందుకే బ‌డ్జెట్ విష‌యంలో గేట్లు ఎత్తేయ‌డంతో పాటు గోపీచంద్‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేసింద‌ట‌.

బాల‌య్య సినిమాను హిట్ చేస్తే.. ఏకంగా మ‌హేష్‌బాబుతో సినిమా చేసే ఛాన్స్ ఇస్తామ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. మైత్రీ వాళ్ల‌కు, మ‌హేష్‌బాబుకు మంచి లింకులు ఉన్నాయి. మైత్రీ అడ‌గ‌డ‌మే చాలు డేట్లు ఇవ్వ‌డానికి మ‌హేష్ ఎప్పుడూ రెడీయే..! మ‌హేష్ అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చే విష‌యంలో మైత్రీ వాళ్ల‌కు మొహ‌మాటాలు ఉండ‌వు. ఇప్పుడు మ‌లినేని బాల‌య్య సినిమాను హిట్ చేస్తే చాలు మ‌హేష్ మూవీకి రెడీ అయిపోవాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news