Moviesబాలయ్య కోసం హీరోయిన్ అంజలి అంత పని చేసిందా..అనిల్ మాటలకు అంత...

బాలయ్య కోసం హీరోయిన్ అంజలి అంత పని చేసిందా..అనిల్ మాటలకు అంత షాక్..?

బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమా తో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ ..ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. NBK107 పేరుతో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక బర్త్ డే సందర్భంగా బాలయ్యకు విషెష్ చెప్తూ… ఈ చిత్రంకు సంభందించిన టీజర్ ని వదలబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. పైగా ఈ సినిమాలో బాలయ్య ని మనం ఇది వరకు ఎప్పుడు చూడని ఢిఫరెంట్ స్టైల్ లో చూడబోతున్నామని డైరెక్టర్ ఇది వరకే చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మొదలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు.నిజానికి ఈ సినిమాని అనిల్ ఫుల్ కామెడి గా తీసుకెళాలి అనుకున్నారట. కానీ, బాలయ్య అభిమానుల కోసం పూర్తి స్దాయి యాక్షన్ డ్రామా గానే తెరకెక్కించాలని చూస్తున్న అనిల్ కు ..F3 సినిమా చూసిన బాలయ్య..”వద్దు..నీ కామెడీ ఫార్ములా ని కూడా మిక్స్ చేస్తే ..సినిమా ఇంకా బాగుంటుంది”అని చెప్పుకొచ్చారట.

కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని అని స్వయంగా అనీల్ రావిపుడి నే చెప్పుకొచ్చారు. ఆ మాటతో అంతా షాక్ అయ్యారు. శ్రీలీలను కూతురు రోల్ చేయ్యించాలని ఎలా అనుకున్నావ్ అంటూ కొన్ని రోజులు ట్రోల్ కూడా చేసారు జనాలు. ఇక హీరొయిన్ గా మెహ్రీన్, ప్రియమణి ఇద్దరిలో ఒకరిని మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారట. అయితే, సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని..కానీ ఆమె ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇప్పటికే డిక్టేటర్ చిత్రంలో బాలయ్యతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి బాలయ్య చిత్రంలో మెరవబోతోందని టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఈ లేడీ విలన్ పాత్ర హైలైట్‌గా ఉండబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన లైన్‌ను కూడా అంజలికి వినిపించారని, ఆ వెంటనే ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఆమె తమిళంలో ఓ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట. హీరోయిన్ గా ఎదగాలి అనుకున్న అంజలి..ఇలా విలన్ రోల్ కి సైన్ చేయ్యడం షాకింగ్ గానే ఉందంటున్నారు దీంతో అప్పుడే ఈ పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి చూడాలి అంజలి విలన్ గా ఎలా మెప్పిస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news