Moviesబాలయ్య సినిమా టైటిల్స్‌ను ఇప్పుడు ఫ్యాన్సే డిసైడ్ చేస్తున్నారా..?

బాలయ్య సినిమా టైటిల్స్‌ను ఇప్పుడు ఫ్యాన్సే డిసైడ్ చేస్తున్నారా..?

అఖండ విజయంతో బాలకృష్ణ మంచి దూకుడు మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. అంతేకాదు, సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అయితే, బాలయ్య సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి అందరి అభిమానుల్లో ఉండే ఆతృత ఆరాటం ఆ సినిమాకు ఏ టైటిల్ పెడుతున్నారనేదే. అంత క్రేజ్ ఉంటుంది బాలయ్య సినిమాకు పెట్టే టైల్టి. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు టైటిల్ విషయంలో పెద్ద చర్చలే జరుగుతుంటాయి. ఇది బాలయ్య నటించిన సమర సింహారెడ్డి సినిమా నుంచి మొదలైంది.

ఫ్యాక్షన్ సినిమాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయం మొదలు పెట్టారు బాలకృష్ణ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, చెన్నకేశవ రెడ్డి..ఇలా టైటిల్‌లోనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఏ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయో..కొత్తగా బాలయ్య కోసం ఎలాంటి సీన్స్ రాశారో, ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ రాశారో అని అందరూ ఉబలాటంగా ఉంటారు. ఇక ఆయన పాత్ర ఎంత బలంగా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇదే భయం దర్శకనిర్మాతల మనసులోనూ ఉంటుంది. అదే భయంతో, అభిమానంతో కథ, కథనం, సన్నివేశాలు, డైలాగులు తయారు చేస్తున్నారు.

నాలుగు కాదు ఇంకో నాలుగు పేజీల డైలాగులనైనా బాలయ్య సింగిల్ టేక్‌లో చెప్పిన సందర్భాలున్నాయి. రోజంతా పడుతుందనుకున్న పైస వసూల్ సినిమాలోను మావా ఏక్ పెగ్‌లా ఒక్క గంటలో కంప్లీట్ పాడేసి వెళ్ళిపోయారు. అదీ బాలయ్య పద్ధతి. ఇక బాలయ్య సినిమాకు టైటిల్‌ను ఆయన అభిమానులే ఫైనల్ చేసేస్తుంటారనే చర్చలు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోంది. మేకర్స్ ఓ టైటిల్ అనుకొని దాన్ని అభిమానులకు చేరవేస్తున్నారు.

అది నందమూరి అభిమానులు తమకు నచ్చిందంటే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ నచ్చకపోతే అదీ డిసైడ్ చేస్తున్నారు. అందుకే, దాదాపు బాలయ్య సినిమాకు అభిమానులే పలానా టైటిల్ అయితే బాలయ్యకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ చేస్తున్నారు. నా సక్సెస్‌లకు కారణం నా అభిమానులే అని బాలయ్య చెప్పిన మాటను ప్రతీసారి నిజం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news