Moviesనానికి అంత సీన్ లేదు..ఆయన సినిమాలు హిట్ అవ్వడానికి ...

నానికి అంత సీన్ లేదు..ఆయన సినిమాలు హిట్ అవ్వడానికి కారణం వాళ్ళే..తెర పై సంచలన మ్యాటర్..?

నాచురల్ స్టార్ నాని..అంటే జనాల్లో అదో తెలియని క్రేజ్. ఆయన యాక్టింగ్ స్టైల్ ఢిఫరెంట్ గా ఉంటుందని అంటుంటారు. ఎలాంటి క్యారెక్టర్స్ లో నైన ఇమిడిపోయి నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఆయన పై నెగిటీవ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపొయారు. నాని ఏం మాట్లాడినా..ఏం చేసినా..ఓ సో కాల్డ్ భజన బ్యాచ్చ్..కావాలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన పై కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే..నాని హీరో గా నటించిన లేటేస్ట్ సినిమా..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమా..మొన్న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి, అబ్బాయి..లవ్ చేసుకుంటే..ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్‌స్ ఎలా ఉంటాయనే పాయింట్ ని చాలా చక్కగా ఫన్నీగా చూయించాడు డైరెక్టర్.

అయితే, ఈ సినిమాలో నాని కి జంటగా మలయాళ్ల బ్యూటీ నజ్రియా నజిమ్..నటించింది. కాగా, ఈ సినిమాలో అమ్మడు నటనకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే, ఇదే పాయింట్ ని ప్లస్ గా తీసుకున్న నాని హేటర్స్..ఈ సినిమా నజ్రియా కారణమే ఇంత హిట్ అయ్యిందని. సినిమాలో ఆమె లేకుంటే నాని క్యారెక్టర్ కి అంత పేరు వచ్చేది కాదని కావాలనే టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.

గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమా విషయంలోను ఇదే విధంగా నానిని టార్గెట్ చేసి..సినిమా సాయి పల్లవి కారణంగానే హిట్ అయ్యిందంటూ.. ఓ సో కాల్డ్ బ్యాచ్ విపరీతంగా ట్రోల్ చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ “అంటే సుందరానికి” సినిమా విషయంలో బాగా ట్రోల్ చేస్తున్నారు . నానిని ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మనకు తెలిసిందే..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news