Moviesబాలకృష్ణతో ఈ హీరోలు జతకడితే..ఇండస్ట్రీ లెక్కలు మారిపోవాల్సిందే...పక్కా....

బాలకృష్ణతో ఈ హీరోలు జతకడితే..ఇండస్ట్రీ లెక్కలు మారిపోవాల్సిందే…పక్కా….

నట సింహం నందమూరి బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎప్పుడూ రెడీనే. కానీ, హీరోలే కొందరు కొన్ని లిమిటేషన్స్ వల్ల కాంబినేషన్ సెట్ చేయడానికి కుదరడం లేదు. ముందుగా నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకులు జూనియర్ ఎన్.టి,ఆర్, కళ్యాణ్ రాం లతో కలిసి సినిమా వస్తే నందమూరి వంశానికే అది మరపురాని చిత్రంగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బాలయ్యతో అబ్బాయిలు నటించ సినిమా కంప్లీట్ ఫ్యాక్షన్ స్టోరీ అయితే, అది కూడా వి వి వినాయక్, బోయపాటి లాంటి దర్శకులైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులే.

ఎందుకంటే ఈ దర్శకులు అటు బాలయ్యతోనూ, ఇటు ఎన్.టి.ఆర్‌తోనూ సినిమాలు తీశారు కాబట్టి..ఎలా చూపిస్తే అభిమానులు థియేటర్స్ వద్ద కటౌట్స్‌కు పాలాభిషేకాలు చేస్తారో పక్కాగా తెలుసు. ఇక బాలయ్య – చిరంజీవి, బాలయ్య – పవన్ కళ్యాణ్ అంటే ఊహించని కాంబినేషన్. ఉత్తర ధృవం దక్షిణ ధృవం ఎప్పటికీ కలవవు. కలిస్తే అదో చరిత్ర. అలాంటి చరిత్ర సృష్ఠించే సినిమా వస్తే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నమోదవని సరికొత్త రికార్డులు నమోదవుతాయి. కానీ, మెగా – నందమూరి హీరోలకు సరిపోయే కథ వండటమే చాలా కష్టం.

బాలయ్యకు ఎలాంటి ఇగోలు లేవు. ఆయన కథ నచ్చితే అందులో మీరు ఈ హీరోతో కలిసి నటించాలి అంటే ఒకే అంటారు. కానీ, అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పడం కాస్త కష్టమే. బాలయ్యకు మల్టీస్టారర్ చిత్రాలు కొత్తేమీ కాదు. తండ్రి నందమూరి తారకరామారావుతో ఏళ్ల క్రితమే పౌరాణిక, జానపద చిత్రాలలో నటించి శభాష్ అనిపించుకున్నారు.

ఇప్పుడున్న హీరోలతో నటించి బాక్సులు బద్దలు కొట్టడం బాలయ్యకు ఒక లెక్కకాదు. కేవలం మెగా హీరోలే కాదు, వెంకటేశ్, రానా, నాగార్జున, మోహన్ బాబు లాంటి హీరోలతో కలిసి బాలయ్య సినిమా చేస్తే స్క్రీన్ మీద చూడటానికి రెండు కళ్ళూ చాలవు. కానీ, ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడం అంటే కత్తిమీద సాము చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news