Moviesఆ విష‌యంలో టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో ఎన్టీఆరే... శేఖర్ మాస్ట‌ర్...

ఆ విష‌యంలో టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరో ఎన్టీఆరే… శేఖర్ మాస్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌

టాలీవుడ్‌లో ఇప్ప‌టి త‌రం యంగ్‌హీరోలు అంద‌రూ దాదాపుగా డ్యాన్సుల్లో కుమ్మేస్తూ ఉంటారు. స‌రైన స్టెప్స్ ప‌డాలే కాని త‌మ స్టెప్పుల‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించేస్తూ ఉంటారు. మ‌హేష్‌బాబు సింపుల్ స్టెప్స్‌, చెర్రీ క్యూట్ స్టెప్స్ వేస్తే ఇక బ‌న్నీ వ‌ర్సెస్ తార‌క్ అయితే ఏ స్టెప్ అయినా బాడీని ఒంపులు తిప్పేస్తారు. టాలీవుడ్‌లో ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో ఎవ‌రు నెంబ‌ర్ వ‌న్ అన్న ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్‌, బ‌న్నీ పేర్లే చాలా మంది చెపుతుంటారు.

తాజాగా ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ వీజే ఎన్టీఆర్ డ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే శేఖ‌ర్ మాస్ట‌ర్ కామెంట్స్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆయ‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోల్లో ఎవ‌రు తక్కువ రిహార్స‌ల్స్ చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు మాస్ట‌ర్ ఆన్స‌ర్ ఇస్తూ ఎన్టీఆర్ పేరు చెప్పాడు.

తార‌క్ అయితే ఎంత క‌ష్టం అయిన స్టెప్ అయినా పెద్ద‌గా రిహార్స‌ల్ లేకుండానే వ‌చ్చి వేసేస్తాడ‌ని అన్నాడు. అస‌లు ఒక్కోసారి తార‌క్‌కు రిహార్స‌ల్ కూడా అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని చెప్పాడు. డైరెక్టుగా డ్యాన్స్ సెట్స్‌లోకి వ‌చ్చి అక్క‌డే ఓ సారి ప్రాక్టీస్ చేసి వెంట‌నే స్టెప్ వేసేస్తాడ‌ని చెప్ప‌డంతో తార‌క్ ఎంత టాలెంట్ ఉన్న న‌టుడో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. తార‌క్ – శేఖ‌ర్ మాస్ట‌ర్ కాంబినేష‌న్లో ఎన్నో పాట‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

తార‌క్‌కు చిన్న‌ప్పుడే తండ్రి భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి నేర్పించడంతో డ్యాన్సుల్లో ఆరితేరిపోయాడు. 21 ఏళ్ల‌కే సింహాద్రి సినిమాలో బొద్దుగా ఉండి కూడా వేసిన స్టెప్పులు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. ఇండ‌స్ట్రీ వాళ్లు చెప్పిన‌ట్టు ఎన్టీఆర్ న‌ట‌న‌లో , డైలాగులు చెప్ప‌డంలో, ఎమోష‌న్ పండించ‌డంలో.. డ్యాన్సుల్లో ఇలా ఆల్‌రౌండ‌ర్‌… స‌క‌ళ క‌ళా వ‌ల్ల‌భుడు అని చెప్పాలి.

తార‌క్‌కు చాలా క‌ళ‌ల్లో ప్రావీణ్యం ఉంది. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఎమోష‌న‌ల్ న‌ట‌న‌లో ఎన్టీఆర్‌ను కొట్టేవారే ఉండ‌రు. ఇక శేఖ‌ర్ మాస్ట‌ర్ కాంప్లిమెంట్‌తో ఎన్టీఆర్‌కు సాటివ‌చ్చేలా డ్యాన్సులు చేసే హీరో కూడా లేడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news