Moviesఊహించని సర్‌ప్రైజ్ తో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఊపు..సూపరో సూపర్...

ఊహించని సర్‌ప్రైజ్ తో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఊపు..సూపరో సూపర్ ..!!

మెగా పవర్ స్టార్ నటించిన RRR సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ ని చరణ్ ఖాతాలో పడేలా సూపర్ గా డిజైన్ చేశాడు చరణ్ క్యారెక్టర్ ని. ఈ సినిమా సక్సెస్ తో మెగా అభిమానుల్లో ఆ ఆనందం క్లీయర్ గా కనిపించింది. కానీ, ఆ ఆనందం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆచార్య సినిమాతో ఆ ఆనందం మంట కలిసిపోయింది.

ఏదో ఊహించుకుని..వెళ్లితే..మరేదో చూయించి..కొరటాల మెగా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశారు. కొందరు అభిమానులు అయితే ఏకంగా ఆయనని తిట్టారు కూడా..ఇప్పుడు ఆ వేడి చల్లారిందే కానీ, మెగా అభిమానుల్లో ఆ ఊపు మాత్రం రాలేదు. దీంతో మెగా అభిమానుల్లో మళ్లి ఆ ఊపు రావడానికి..క్రేజీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడట కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.

మనకు తెలిసిందే..చరణ్ ప్రజెంట్ ఆయన దర్శకత్వంలో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో..పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లు గా నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీపార్ట్, సాంగ్స్, భారీ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేశారు. కాగా, సినిమా కి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఏం చెప్పలేదు.

సోషల్ మీడియాలో ఆయన లుక్స్ వైరల్ అయ్యాయే కానీ, మూవీ టీం మాత్రం ఏం చెప్పలేదు. ఇప్పుడు RC 15 మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎవ్వరు కని విని ఎరుగని రీతీలో ఈ లుక్ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news