Moviesఎఫ్ 3 టీంకు త‌మ‌న్నాకు చెడిందా... ఏం జ‌రిగింది...?

ఎఫ్ 3 టీంకు త‌మ‌న్నాకు చెడిందా… ఏం జ‌రిగింది…?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మామూలుగా అయితే ఫేడ‌వుట్ అయిపోయింది. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండ‌డంతో పాటు సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు ఎవ్వ‌రూ దొర‌క్క‌పోవ‌డంతో ఆమెకు ల‌క్కీ ఛాన్సులు వ‌స్తున్నాయి. ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో ఆమెకు ఛాన్స్ రావ‌డం అంతా వెంకీ, అనిల్ రావిపూడి పుణ్య‌మే. వెంకీ ప‌క్క‌న హీరోయిన్‌గా ఎవ్వ‌రూ సెట్ కాక చివ‌ర‌కు త‌మ‌న్నాను అనిల్ బుక్ చేసి ఆమె పాలిట అదృష్ట దేవుడు అయ్యాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో కీల‌క పాత్ర ద‌క్కించుకున్న ఆమె ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్ భోళాశంక‌ర్ సినిమాలోనూ ఎవ్వ‌రూ హీరోయిన్‌గా దొర‌క్క‌పోవ‌డంతో ఆమెనే ఫిక్స్ చేశారు. ఛాన్సులు లేక‌పోయినా.. కూడా త‌మ‌న్నా యాట్యిట్యూడ్ బాగా చూపిస్తోందా ? అన్న గుస‌గుస‌లు అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక ఎఫ్ 3 సినిమా మ‌రో నాలుగు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

ప్ర‌చారం అయితే మామూలుగా చేయ‌డం లేదు. అటు నిర్మాత దిల్ రాజు, ఇటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇలా చెప్పుకుంటూ పోతే అంద‌రూ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. చివ‌ర‌కు దిల్ రాజు కూడా త‌న వంతుగా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. హీరోలు వెంకీ, వ‌రుణ్ ఎక్క‌డ చూసినా వాళ్లే సంద‌డి చేస్తున్నారు. అనిల్ రావిపూడి వ‌రుస పెట్టి ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

త‌మ‌న్నా కాకుండా ఉన్న మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు మెహ్రీన్‌, సోనాలి కూడా త‌ళుక్కున మెరిశారు. కానీ త‌మ‌న్నా మాత్రం ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. ఎఫ్ 3 హ‌డావిడి ఇంత భ‌యంక‌రంగా ఉంటే త‌మన్నా హడావిడి ఎందుకు లేదు అన్న డౌట్లు రానే ఉన్నాయి. క‌నీసం ఆమె ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు కూడా రాలేదు. పేరుకు ఆమె కేన్స్‌కు వెళ్లాను అని చెప్పుకోవ‌చ్చు.. కానీ అస్స‌లు ఒక్క ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లోనూ ఆమె లేదు.

వాస్త‌వానికి త‌మ‌న్నాకు, ఎఫ్ 3 యూనిట్‌.. అంటే ద‌ర్శ‌కుడు అనిల్‌కు మ‌ధ్య ఏదో జ‌రిగింద‌న్న గుస‌గుస‌లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఇదంతా ఉత్తిదే అని వారు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవి నిజం అనిపించేలా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news