Moviesబ్లాస్టింగ్ కాంబినేషన్..డ్రీమ్ హీరోయిన్ కు చిరు బంపర్ ఆఫర్..!!

బ్లాస్టింగ్ కాంబినేషన్..డ్రీమ్ హీరోయిన్ కు చిరు బంపర్ ఆఫర్..!!

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ వార్త నిజమే అంటున్నారు సినీ ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్ల తో వర్క్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అయ్యింది ఎవరితో అంటే.. అందరు చెప్పే పేరు “రాధిక”. వీళ్ల కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెర పై ఈ జంట కనిపిస్తే బొమ్మ హిట్ అవ్వాల్సిందే..అన్న పేరు సంపాదించుకున్నారు.

ఇక ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ హిట్ పెయిర్ రిపీట్ కానున్నత్లు తెలుస్తుంది. ఇటీవలే ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్​ చిరంజీవి.. యువ హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులను ఒకేసారి నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడాయన మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారని సీనియర్​ నటి రాధిక సోషల్​మీడియాలో ట్వీట్​ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన బ్యానర్​లో ఓ మాస్​ ఎంటర్​టైనర్​ మూవీ చేయబోతున్నారని తెలిపారు ఆమె.

రాధిక-మెగాస్టార్ కుటుంబానికి వున్న సంబంధం గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాధిక భర్త శరత్ కుమార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘నేను ఆర్ధికంగా ఇబ్బందులు పడినపుడు చిరంజీవి ఓ సినిమా అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయనతో చేసిన సినిమా వలన మరలా నిలదొక్కుకున్నాం!’ అని చెప్పారు. నా ఫ్యామిలీ ఫ్రెండ్ రాధిక‌.. త‌నంటే నాకు చాలా అభిమానం అని చిరు ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పారు. రాధిక కూడా ఎప్ప‌టికీ నా ఫేవ‌రెట్ హీరో చిరునే అని చెబుతూర‌నే ఉంటుంది. శ‌ర‌త్ కుమార్ కూడా చిరుకి బాగా ఆప్తుడు.

చిరంజీవి శరత్ కుమార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా శరత్ కుమార్ చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తుంటారు.తాజాగా రాధికా తన ట్విట్టర్ లో మెగా అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా.. శరత్ కుమార్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన ట్వీట్టర్ ఖాతాలో..’శరత్ కుమార్ రాడాన్ బ్యానర్ లో సినిమా చేసేందుకు అంగీకరించిన ప్రియమైన చిరంజీవి ధన్యవాదాలు. కింగ్ ఆఫ్ మాస్ తో బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నాం’ అంటూ రాధికా ట్విటర్ లో ప్రకటించారు. దీంతో ఈ సినిమా లో రాధిక కూడా ఓ కీలక పాత్రలో నతీస్తుందీ ంటూ ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనా ఈ జంట మరోసారి జత కడితే.. ఇప్పుడున్న యంగ్ కపుల్స్ వేస్ట్ అంటున్నారు మెగా అభిమానులు. మరి చూడాలి..ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news