Moviesఆచర్య మూవీపై ఉపాసన రియాక్షన్.. అస్సలు ఊహించలేదుగా..!!

ఆచర్య మూవీపై ఉపాసన రియాక్షన్.. అస్సలు ఊహించలేదుగా..!!

ఉపాసన..మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్యగా.. అపోలో హాస్పిటల్‌ వ్యవస్థాపకులు ప్రతాప్‌ సి. రెడ్డి మనవరాలిగా ఆమెకు ఉన్న పేరు గురించి.. క్రేజ్ గురించి..ఫాలోయింగ్ గురించి..ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలంటి ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునింది ఉపాసన. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఉపాసన్ జనాలకు మంచి చేయాలని..వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని..ఎప్పటికప్పుడు తనకు తెలిసిన మంచి విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన భర్త సినిమా ల గురించి కూదా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 

రీసెంట్ గా తన భర్త మామ నతించిన ఆచార్య సినిమా గురించి పోస్ట్ చేస్తూ.. చరణ్ ఫోటో కి లవ్ లవ్ లవ్ అంటూ రాసుకొచ్చింది. నిజానికి సినిమా అట్టర్ ఫ్లాప్ అనే టాక్ వినిపిస్తుంది. కొరటాల మెగా హీరోలకి దెబ్బేశాడు అంటూ కౌంటర్లు వినిపిస్తున్నాయి. సినిమాలో కధ లేదని.. చరణ్-చిరు ఏం చూసి ఈ సినిమాకి సైన్ చేశారని.. సినిమా చూసిన జనాలు ప్రశ్నిస్తున్నారు. అలాగే, మెగా ఫ్యాన్స్ సైతం సినిమా రిజల్ట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తే.. మాకు ఏదో చూపించావు గురు అంటూ లైవ్ లోనే చెప్పుతున్నారు.

ఇలాంటి టాక్ వస్తున్న క్రమంలో ఆచార్య సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఉపాసన అంటే ఉన్నది ఉన్నత్లు మాట్లాడె మేడమ్ అనుకున్నాం.. ఇలా సినిమా ఫ్లాప్ అయినా పొగడ్తలతో ముంచెత్తేలా అంటూ మెగా యాంటి బ్యాచ్ మండిపడుతుంటే. మరి కొందరు ఆమె భర్త ఆమె అభిప్రాయం షేర్ చేసుకుంది మధ్య లో ఈ భజన బ్యాచ్ కి ఇబ్బంది ఏంటి అంటూ రీవర్స్ కౌంటర్లు వేస్తున్నారు.

జనాలు ఉపాసన కే సపోర్ట్ చేస్తున్నారు. ఓ భార్య గా తన భర్తను సపోర్ట్ చేసుకునే హక్కు ఆమెకు ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసుకుంటే మెగా అభిమానులను ఆచార్య బాగా ఇబ్బంది పెట్టిన్నట్లు తెలుస్తుంది. మరి కొరటాల దీని గురించి ఏం అంటారు చూడాలి..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news