Moviesబలవంతంగా విజయ్ నా పెదాలపై ముద్దుపెట్టాడు..నటి మాటలకి ఇండస్ట్రీ షాక్..!!

బలవంతంగా విజయ్ నా పెదాలపై ముద్దుపెట్టాడు..నటి మాటలకి ఇండస్ట్రీ షాక్..!!

గత నాలుగు రోజుల నుండి మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న మ్యాటర్.. మలయాళీ నటుడు, నిర్మాత విజయ్ బాబు పై లైంగిక ఆరోపణలు. చూసేందుకు సైలెంట్ గా ఉన్నా ..ఆయనలో ఇంత మ్యాటర్ ఉందా అని.. అసలు మ్యాటర్ లీక్ అయ్యేవరకు ఎవ్వరికి తెలియలేదు. పలు సినిమా ల్లో నటించిన ఈ విజయ్ బాబు.. కొన్ని సినిమాలకి ప్రోడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానంటూ ఆశ చూపి, మాయ మాతలు చెప్పి.. అమ్మాయితో కమిట్ అయ్యి.. దారుణంగా అత్యాచారం చేశాడని ఓ నటి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన అసలు రంగు బయట పడింది.


దీంతో నటుడు విజయ్ బాబుపై ఎర్నాకుళం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323 కింద కేసులు నమోదు చేశారు. కొజికోడ్​కు చెందిన ఓ మహిళ విజయ్‌బాబు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని … సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని తనను నమ్మించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించింది. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో విజయ్.. అనేక సార్లు తనను వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొంది. తనపై కేసు నమోదైందనే విషయం తెలిసినప్పటి నుంచి విజయ్ బాబు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం లుకౌట్ నోటీసు జారీ చేయడమే కాకుండా, కేరళతో పాటు పలు ప్రాంతాల్లో అతని కోసం వెతుకుతున్నారు. ఈ కేస్ నడుస్తుండగానే మరో నటి.. విజయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా మరో మహిళ విజయ్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని శుక్రవారం ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డింది. నిజంగా ఆయన అంత నీచుడా అంటూ షాక్ అవుతుంది. ఆమె పోస్ట్ లో ఏం రాసిందంటే..”నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్‌ యజమాని విజయ్‌బాబును 2021 నవంబర్‌లో ఒకసారి నేనుకలిశాను. అది కూడా వర్క్‌ గురించి మాట్లాడేందుకే. మేమిద్దరం ప్రొఫెషనల్‌ విషయాల గురించి చర్చించుకున్నాం. ఆ తరువాత ఆయనే నన్ను నా ఫ్యామిలీ గురించి అడిగారు. నా ప్రాబ్లమ్‌స్ అన్ని వివరించాను. నా బాధలు చెప్పాను. అప్పుడే ఆయన నాకు మందు ఆఫర్ చేశాడు.

 

నాకు అలవాటు లేదు వద్దు అని చెప్పాను. ఆయన తాగుతూ నన్ను తాగమని బలవంతపెట్టాడు. వద్దు వద్దు అని చెపుతున్న వినలేదు. నేను వద్దు అని గట్టిగా చెప్పాను. వెంటనే నా మీదకు వచ్చి పర్మిషన్ లేకుండానే బలవంతంగా నా పెదాలపై ముద్దుపెట్టాడు. నేను షాక్ అయ్యాను. కోపం గా చూశాను. అతడు చేసిన పనికి షాకైన నేను క్షణాల్లో దూరం జరిగాను. మళ్లీ ఇంకో ముద్దు పెట్టడానికి పై పైకి వచ్చాడు. నేను పైకి లేచి వెళ్లిపోతున్నప్పుడు సారీ సారీ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ప్లీజ్ అంటూ..బ్రతిమిలాడాడు. తరువాత నాకు సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు. రీసెంట్ ఇష్యూ తో నాకు ధైర్యం వచ్చింది. అందుకే చెప్పాను”అంటూ రాసుకొచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news