Moviesఆ దివంగ‌త అందాల తార‌ను దారుణంగా వాడుకున్న స్టార్ ప్రొడ్యుసర్ ?

ఆ దివంగ‌త అందాల తార‌ను దారుణంగా వాడుకున్న స్టార్ ప్రొడ్యుసర్ ?

టాలీవుడ్ లో రెండు దశాబ్దాల కిందట ఓ స్టార్ హీరోయిన్ ఓ హిట్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆమె ఓ అందాల తార. తొలి సినిమాతోనే తిరుగులేని సూపర్ హిట్ కొట్టేసింది. అప్పటి వరకూ విదేశాల్లో ఉన్న ఆ హీరోయిన్ ఫోటో చూసిన దర్శక నిర్మాతలు పనికట్టుకుని ఆమెను ఇండియాకు రప్పించి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్‌లో స‌గం క్రెడిట్ ఆ హీరోయిన్ అందానికే దక్కుతుంది. ఆ వెంటనే మరో పెద్ద బ్యానర్లో మళ్లీ సూపర్ హిట్ సినిమా వచ్చేసింది.

అక్కడి నుంచి ఆ హీరోయిన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో ఛాన్సుల‌ మీద ఛాన్సులు కొట్టేసింది. మూడేళ్లు తిరిగేస‌రికి టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ వరుస పెట్టి ఆ హీరోయిన్ వెంటపడటం స్టార్ట్‌ చేశారు. దీంతో ఆమె క్షణం తీరికలేనంత బిజీ హీరోయిన్ అయిపోయింది. చివరకు ఆమె తమ సినిమాలో ఉంటే బిజినెస్ కూడా పెరుగుతుందని… కలెక్షన్లు కూడా బాగా వస్తాయని సీనియర్ హీరోలు, స్టార్ దర్శకులు వరకు అందరూ ఆ హీరోయిన్ అందాన్ని నమ్ముకున్నారు. దీనినిబట్టి అప్పట్లో టాలీవుడ్ లో ఆ హీరోయిన్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.

నాలుగేళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమ ఒక ఊపుఊపిన అందాల తార అనుష్క – నయనతారలా పదేళ్లపాటు మకుటంలేని మహారాణి తెలుగు సినిమా పరిశ్రమ ఏలాల్సి ఉంది. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో ఆమె కెరీర్ లో వేసిన రాంగ్ స్టెప్ ఆమె కెరీర్‌ను పాతాళంలోకి నెట్టేసింది.
ఓ యంగ్‌ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడి కెరీర్ నిర్లక్ష్యం చేసింది. దీనికి తోడు కొన్ని చెడు అలవాట్లు కూడా ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. అదే సమయంలో ఆ యంగ్ హీరో ఇంట్లో ఆమెను కోడ‌లిగా తీసుకునేందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె డిప్రెష‌న్‌లోకి వెళ్ళిపోయింది.

అయితే ఇక్కడే మరో వాస్తవం కూడా ఉంది. ఇది ఇండస్ట్రీలో చాలామంది కూడా తెలుసు.. కానీ ఎవ్వ‌రు దీని గురించి నోరు మెద‌ప‌రు. ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసింది.. ఆ యంగ్ హీరో అని ఆడి పోసుకుంటారే కాని.. ఆమెను ఇబ్బంది పెట్టిన పెద్దోళ్ల గురించి బ‌య‌ట‌కు చెప్పే ద‌మ్ము ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రికి ఉండ‌దు. ఆ అందాల తారకు కెరీర్ ప్రారంభంలో వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన ఓ పెద్ద నిర్మాత సైతం ఆమెను ఫుల్లుగా వాడుకున్నాడు అని అంటారు.

ఆ అందాల తారను ఎక్కువగా తన గెస్ట్ హౌస్ లోనే ఉంచుకునేవాడ‌ని… ఆ విషయం ఆ హీరోయిన్ ప్రేమించిన హీరో ఇంట్లో తెలియ‌డంతో ఆమెను కోడలిగా ఒప్పుకోలేదు అని కూడా అంటారు. ఆ త‌ర్వాత సినిమా ఛాన్సులు లేక‌.. అటు వైవాహిక జీవితం ఫెయిల్ అయ్యి…. అనారోగ్యంతో ఆమె లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. కారణం ఏదైనా తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆ అందాల తార జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news