Moviesస‌మంత తొలి సంపాద‌న ఎంతో తెలుసా... షాకింగ్ అవ్వాల్సిందే..!

స‌మంత తొలి సంపాద‌న ఎంతో తెలుసా… షాకింగ్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ అనేది ఎంతో మంది నటీన‌టుల‌కు, మంచి టెక్నీషియ‌న్ల‌కు వేదిక‌. టాలెంట్ ఉండాలే కాని.. ఒక‌టి రెండు ఛాన్సుల‌తో త‌మ‌ను తాము ఫ్రూవ్ చేసుకుంటూ దూసుకుపోవ‌చ్చు. త‌మిళ్ అమ్మాయి స‌మంత తెలుగులో నాగ‌చైత‌న్య హీరోగా వ‌చ్చిన ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఏ మాయ చేశావే త‌ర్వాత అస‌లు తెలుగులోనే కాదు.. సౌత్‌లో స‌మంత వెనుదిరిగి చూసుకోలేదు.

అస‌లు ఏడెనిమిదేళ్ల పాటు స‌మంత సౌత్‌లో అంద‌రు స్టార్ హీరోల ప‌క్క‌న న‌టిస్తూ సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టేసింది. అటు స్టార్ హీరోల‌తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ల‌కు కూడా స‌మంత బెస్ట్ ఆప్ష‌న్ అయ్యింది. స‌మంత కేర‌ళ‌లో పుట్టి పెరిగినా ఆమె బాల్యం, చ‌దువు అంతా చెన్నైలోనే జ‌రిగాయి. నాగ‌చైత‌న్య హీరోగా మ‌హేష్‌బాబు అక్క‌డ మంజుల నిర్మాత‌గా ఏమాయ చేశావే సినిమా ప్లాన్ చేశారు.

అప్పుడు హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో గౌత‌మ్ మీనన్ కంట్లో స‌మంత ప‌డింది. ఆ సినిమాలో చైతు – స‌మంత మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ యూత్‌ను పిచ్చెక్కించేసింది. ఆ త‌ర్వాత స‌మంత ప‌దేళ్ల పాటు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. త‌న తొలి సినిమా హీరో చైతుతోనే ప్రేమ‌లో ప‌డ్డ స‌మంత నాలుగేళ్ల ప్రేమ అనంత‌రం 2017లో పెళ్లి చైతును పెళ్లాడింది.. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో చైతుకు విడాకులు ఇచ్చేసింది.

ఇక ఇప్పుడు స‌మంత సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తూ వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. స‌మంత ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న హాట్ ఫొటోలు షేర్ చేయ‌డం లేదా నెటిజ‌న్ల‌తో చిట్ చాట్‌లు చేయ‌డ‌మో చేస్తూ ఉంటుంది. తాజాగా స‌మంత చేసిన చిట్ చాట్‌లో ఓ నెటిజ‌న్ స‌మంత‌ను మీ మొద‌టి సంపాద‌న ఎంత ? అని అడిగేశాడు. అందుకు స‌మంత ఆన్స‌ర్ ఇస్తూ త‌న మొద‌టి సంపాద‌న రు. 5 వేలు అని చెప్పింది.

స‌మంత న‌టి కాక ముందు ఓ హోట‌ల్లో హోస్ట్‌గా ప‌ని చేసింద‌ట‌. అప్పుడు నెల‌కు రు. 5 వేలు స‌మంత‌కు జీతంగా వ‌చ్చేద‌ట‌. అయితే అది జ‌రిగింది ఎప్పుడో కాదు… స‌మంత ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివేట‌ప్పుడు. అయితే స‌మంత ఇప్పుడు ఒక్కో సినిమాకు స‌గ‌టున రు. 3 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. అంటే స‌మంత నెల‌కు రు. 5 వేల జీతం తీసుకునే స్థాయి నుంచి ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు తీసుకునే రేంజ్‌కు వెళ్ల‌డం అంటే మామూలు విష‌యం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news