Movies' స‌ర్కారు వారి పాట ' స్టోరీ లీక్‌... ఫ్యీజులు ఎగిరిపోవాల్సిందే...!

‘ స‌ర్కారు వారి పాట ‘ స్టోరీ లీక్‌… ఫ్యీజులు ఎగిరిపోవాల్సిందే…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు ఇలా వ‌రుస హిట్ల‌తో మ‌హేష్ బాబు మార్కెట్ మామూలుగా లేదు. ఓ యావ‌రేజ్ క‌థ‌తో కూడా మ‌హేష్ సూప‌ర్ హిట్లు కొట్టేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా మే 12న రిలీజ్ చేస్తామ‌ని ముందుగానే ప్ర‌క‌టించారు.

అయితే గ‌త నాలుగు రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేద‌ని.. ముందుగా చెప్పిన‌ట్టు మే 12కు రావ‌డం కుద‌ర‌ద‌న్న ప్ర‌చారం అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ప్ర‌చారంపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ముందుగా అనుకున్న మే 12కే వ‌స్తామ‌ని చెప్పేశారు. ఈ సినిమా ఫైన‌ల్ సాంగ్ ఆల్రెడీ రామెజీ ఫిల్మ్‌సిటీలో స్టార్ట్ చేశామ‌ని… ప్ర‌స్తుతం ఈ సాంగ్ షూట్ స్పీడ్‌గా న‌డుస్తోంద‌ని ట్వీట్ చేశారు.

ఈ సాంగ్ ఫినిష్ అయిన వెంట‌నే మ‌రికొన్ని పిక్స్ కూడా కొద్ది గంట‌ల్లోనే పోస్ట్ చేస్తాం అని కూడా మేక‌ర్స్ చెప్పారు. ఇక ఈ సినిమా క‌థ ఇదేనంటూ కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఓ లైన్ చ‌క్కెర్లు కొడుతోంది. భార‌త‌దేశంలో గ‌త కొన్నేళ్లుగా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు అని చెప్పుకుంటోన్న వారు బ్యాంకుల్లో భారీగా అప్పులు తీసుకుని కుంభ‌కోణాలు చేశారు.

ఈ పారిశ్రామిక‌వేత్త‌లు చేసిన మోసాల‌తో భారత బ్యాంకింగ్ రంగం కుదేలైంది. ఈ సినిమా కూడా భార‌త బ్యాంకింగ్ రంగంలో మోసాలు చుట్టూ కేంద్రీకృత‌మై ఉంటుంద‌ని… సినిమాలో హీరో తండ్రి బ్యాంకు ఉన్న‌తాధికారిగా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. హీరో తండ్రిని మోసం చేసి వేలాది కోట్లు ఎగ‌వేసిన ఓ బిజినెస్‌మేన్ నుంచి.. అత‌డి అరాచ‌కాల‌ను ఎదుర్కొని హీరో మ‌హేష్‌ ఆ డ‌బ్బును తిరిగి ఎలా ? రివ‌క‌రీ చేశాడు ? అన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది.

ఈ యుద్ధంలో మ‌హేష్ వేసిన ఎత్తులేంటి ? హీరో – హీరోయిన్ల మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో అదిరిపోయే ల‌వ్ ట్రాక్‌, కామెడీ, సాంగ్స్ ఇవ‌న్నీ కూడా సినిమాకు హైలెట్ అంటున్నారు. ఏదేమైనా స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండున్న‌రేళ్ల గ్యాప్‌తో మ‌హేష్ సినిమా వ‌స్తోంది. మహేష్ అభిమానులు అయితే మామూలుగా వెయిట్ చేయ‌ట్లేదు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news