Moviesబ‌ట్ట‌లు విప్ప‌మ‌ని ఒళ్లంతా త‌డిమేవాడు... బోల్డ్‌బ్యూటీ సంచ‌ల‌నం...!

బ‌ట్ట‌లు విప్ప‌మ‌ని ఒళ్లంతా త‌డిమేవాడు… బోల్డ్‌బ్యూటీ సంచ‌ల‌నం…!

ఇండియ‌న్ సినిమా హీరోయిన్ల‌లో ఎంతో మంది ఉన్నా తిరుగులేని ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ అయిపోయింది బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌. కంగ‌న మ‌న‌సులో ఏం ఉందో అది వెంట‌నే ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. చివ‌ర‌కు మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న శివ‌సేన ప్ర‌భుత్వంతో కూడా ఆమె ఏ మాత్రం బెరుకు లేకుండా ఫైట్ చేసింది. అందుకే ఆమెను ఫైర్‌బ్రాండ్ లేడీ అని పిలుస్తూ ఉంటారు.

బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె ఎంత‌లా పోరాటం చేసిందో చూశాం. బాలీవుడ్‌లో పేరున్న బ‌డా బ‌డా హీరోల‌నే ఆమె ఎదిరించి ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంది. అస‌లు కంగ‌నా కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అవుతూ.. తాను ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి మాట్లాడ‌డం ప్రారంభించాకే దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హీరోయిన్లు, అమ్మాయిలు, బుల్లితెర న‌టీమణులు ఈ కాస్టింగ్ కౌచ్‌ను ఓ మ‌హా య‌జ్ఞంలా ముందుకు తీసుకువెళ్లారు.

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కంగ‌నా అన్ని విష‌యాల‌పై ఓపెన్ అవుతూనే ఉంటుంది. మ‌రోవైపు బాలీవుడ్‌లో క్రేజీ షోల‌కు హోస్ట్‌గా కూడా ఉంటూ వ‌స్తోంది. తాజాగా బాలీవుడ్‌లోనే కాంట్ర‌వ‌ర్సియ‌ల్ షోగా మారిన లాక్ అప్‌లో ప్ర‌తి వారం జ‌డ్జ్‌మెంట్ డే వ‌స్తుంది. ఆ రోజు ఎంతో మంది బాలీవుడ్ స్టార్లు త‌మ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా బ‌య‌ట పెడుతూ ఉంటారు. తాజాగా ఓ న‌టుడు త‌న చిన్న‌ప్పుడు ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి కూడా ఓపెన్ అయ్యాడు.

తన‌కు 6 నుంచి 11 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్ప‌టి నుంచే త‌న బంధువులు, స్నేహితులు లైంగీకంగా వేధించార‌ని.. అయితే తాను చిన్న పిల్లాడిని కావ‌డంతో త‌న‌కు అర్థం కాలేద‌ని.. పెద్ద‌ల‌కు చెప్పినా అర్థం చేసుకోర‌న్న భ‌యంతో చెప్ప‌లేద‌ని తెలిపాడు. అయితే కంగ‌నా కూడా త‌న జీవితంలో ఇలాంటి అనుభ‌వ‌మే త‌న‌కు ఎదురైంద‌ని చెప్పి అంద‌రిని షాకింగ్‌కు గురి చేసింది.

త‌న‌కు 6 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు త‌న‌కంటే వ‌య‌స్సులో పెద్ద వాడు అయిన ఓ వ్య‌క్తి త‌న‌ను అస‌భ్య‌క‌రంగా తాకేవాడ‌ని.. ఆ వ‌య‌స్సులో అత‌డి ఉద్దేశం ఏంటో త‌న‌కు అర్థం కాలేద‌ని చెప్పింది. అంతే కాకుండా త‌న‌ను బ‌ట్ట‌లు విప్ప‌మ‌ని ఒళ్లంతా త‌డిమేవాడ‌ని కూడా చెప్పింది. ఇలాంటి వాటిని స‌మాజంలో ఓ పెద్ద క్రైం గా కూడా చూడాల‌ని కంగ‌నా చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news