Moviesబాల‌య్య సినిమాపై మ‌రో అప్‌డేట్ ఇచ్చేసిన అనిల్ రావిపూడి..!

బాల‌య్య సినిమాపై మ‌రో అప్‌డేట్ ఇచ్చేసిన అనిల్ రావిపూడి..!

బాల‌య్య అఖండ గ‌ర్జ‌న త‌ర్వాత దూసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమా షూటింగ్‌లో బిజీ ఉన్నాడు. బాల‌య్య కెరీర్‌లో 107వ సినిమాగా తెర‌కెక్కే ఈ ప్రాజెక్టులో అందాల తార శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌లినేని గోపీ సినిమా త‌ర్వాత బాల‌య్య టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు కంటిన్యూగా వ‌స్తోన్న ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పైగా ఈ సినిమా వ‌చ్చిన రెండు రోజుల‌కే చిరంజీవి – చెర్రీ న‌టించిన ఆచార్య కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డంతో ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫైట్‌పై అంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

ఎఫ్ 3 రిలీజ్ అయిన వెంట‌నే అనిల్ రావిపూడి బాల‌య్య సినిమా కోసం క‌థా క‌స‌ర‌త్తులు చేస్తారు. ఈ ప్రాజెక్టు గురించి రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. తాజాగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చేశారు. బాల‌య్య సినిమా మ‌ల్టీస్టార‌ర్ అంటూ ఒక్క‌టే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాల‌య్య‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తార‌ని ఓ సారి.. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టిస్తారని మ‌రోసారి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

ఈ వార్త‌ల‌కు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం తాను ఎఫ్ 3 మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నాన‌ని.. బాల‌య్య సినిమా కోసం క‌థ ఇప్ప‌టికే రెడీ అయ్యింది.. ఇది సింగిల్ హీరో సినిమా మాత్ర‌మే… మ‌ల్టీస్టార‌ర్ కాద‌ని చెప్పేశారు. దీంతో బాల‌య్య .. అనిల్ సినిమాలో సింహంలా సింగిల్ గానే రాబోతున్నాడ‌ని క్లారిటీ వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news