Moviesబాక్సాఫీస్‌ను ఢీకొట్టిన ముగ్గురు స్టార్ హీరోల ఆటోలు.. బోల్తా ప‌డిన ఆటో...

బాక్సాఫీస్‌ను ఢీకొట్టిన ముగ్గురు స్టార్ హీరోల ఆటోలు.. బోల్తా ప‌డిన ఆటో ఎవ‌రిదంటే..!

కొన్ని ప‌దాలు క‌లిసేలా స్టార్ హీరోలు సినిమాలు చేయ‌డం ఎప్ప‌టి నుంచో జ‌రుగుతూ వ‌స్తోంది. మ‌న తెలుగులో ఈ సంస్కృతి బాగా ఎక్కువ‌. ఇది ఇప్ప‌టి నుంచే కాదు.. 1980వ ద‌శ‌కం నుంచి ఎక్కువుగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు స‌ర‌దా బుల్లోడు, బంగారు బుల్లోడు, ఘ‌రానా బుల్లోడు ఇలా స‌గం టైటిల్ క‌లిసి వ‌చ్చేలా స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ ఉంటారు. 1990వ ద‌శ‌కంలో ఆటో క‌థాంశంతో ముగ్గురు హీరోలు న‌టించిన సినిమాలు వ‌చ్చాయి. ఈ ముగ్గురు కూడా స్టార్ హీరోలే. ఈ మూడు ఆటో సినిమాల్లో ఏ సినిమా హిట్ అయ్యింది.. ఏ సినిమా ఫ‌ట్ అయ్యిందో చూద్దాం.

జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి లాంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత రాఘ‌వేంద్రరావు – చిరంజీవి కాంబినేష‌న్లో రౌడీ అల్లుడు సినిమా వ‌చ్చింది. అల్లు అర‌వింద్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మాణంలో వ‌చ్చిన ఈ సినిమాలో చిరంజీవి డ‌బుల్ రోల్ చేశారు. దివ్య‌భార‌తి, శోభ‌న హీరోయిన్లుగా న‌టించారు. ధ‌న‌వంతుడు అయిన క‌ళ్యాణ్ పాత్ర‌తో పాటు ఆటోజానీగా కూడా చేశారు. ఈ ఆటోజానీ టైటిల్‌నే చిరు – పూరి కాంబోలో సినిమా చేయాల‌ని అనుకున్నా.. అది కుద‌ర్లేదు. బ‌ప్పీల‌హ‌రి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ అయ్యింది.

ర‌జ‌నీకాంత్ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాషా సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ర‌జ‌నీకాంత్ – న‌గ్మా హీరో, హీరోయిన్లుగా న‌టించారు. మాణిక్యంను (ర‌జ‌నీకాంత్‌) ధ‌న‌వంతురాలు అయిన అమ్మాయి ప్రియ ( న‌గ్మా) అత‌డి నిరాడంబ‌ర‌త చూసి ప్రేమిస్తుంది. అస‌లు డాన్‌గా ఉండే మానిక్ బాషా కాస్తా మాణిక్యం అనే ఆటోడ్రైవ‌ర్‌గా ఎందుకు ? మారాడు ? అస‌లు ఆ క‌థ ఏంట‌న్న ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. అస‌లు సౌత్ ఇండియాను ఈ సినిమా ఊపేయ‌డంతో పాటు భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఇక ఇదే ఆటో క‌థాంశంతో నాగార్జున హీరోగా సిమ్రాన్‌, దీప్తి భ‌ట్నాగ‌ర్ హీరోయిన్లుగా అదే బాషా డైరెక్ట‌ర్ సురేష్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఆటోడ్రైవ‌ర్ సినిమా వచ్చింది. కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌పై డి. శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించ‌గా దేవా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత నాగార్జున – సిమ్రాన్ కాంబోలో వ‌చ్చిన నువ్వువ‌స్తావ‌ని సినిమా మాత్రం హిట్ అయ్యింది.

ఇలా మొత్తం ఆటోడ్రైవ‌ర్లుగా ముగ్గురు సూప‌ర్ స్టార్లు న‌టించారు. ఈ ముగ్గురిలో ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి హిట్ కొడితే నాగార్జున ఆటోడ్రైవ‌ర్‌గా ఫెయిల్ అయ్యాడు. అప్ప‌ట్లో ఎవ‌రైనా ఓ పాత్ర‌తో హిట్ కొడితే ఆ పాత్ర‌ను అల్లుకుని వ‌రుస‌గా సినిమాలు రావ‌డం కామ‌న్‌.. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస‌గా ఆటోడ్రైవ‌ర్ సినిమాలు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news