Moviesరాజ‌శేఖ‌ర్ - మెగాస్టార్ మ‌ధ్య గొడ‌వ‌ల‌కు ఆ సినిమాయే కార‌ణ‌మైందా..!

రాజ‌శేఖ‌ర్ – మెగాస్టార్ మ‌ధ్య గొడ‌వ‌ల‌కు ఆ సినిమాయే కార‌ణ‌మైందా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా కుటుంబానికి.. యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజ‌శేఖ‌ర్‌కు మ‌ధ్య ఏవేవో గొడ‌వ‌లు ఉన్నాయి. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఇవి బాగా బ‌హిర్గ‌తం అయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ ఎన్నికల ప్ర‌చారానికి వైజాగ్ వెళ్లి వ‌స్తోన్న రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల‌పై భీమ‌వ‌రంలో మెగా అభిమానులు రాళ్ల‌తో దాడి చేసేందుకు య‌త్నించారు. స్వ‌ల్పంగా రాజ‌శేఖ‌ర్‌కు గాయాలు కూడా అయ్యాయి. అయితే హైద‌రాబాద్ వ‌చ్చాక చిరంజీవి స్వ‌యంగా వారిని ప‌రామ‌ర్శించి.. ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు.

అయితే వీరిద్ద‌రి గొడ‌వ‌ల‌కు ఈ రాజ‌కీయ విబేధాలే కార‌ణం కాదు.. అంత‌కు ముందు ఓ సినిమా కార‌ణ‌మైంది. అదే చిరంజీవి న‌టించిన ఠాగూర్‌. తెలుగులో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా వ‌చ్చిన ఠాగూర్ 192 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ త‌మిళంలో వ‌చ్చిన ర‌మ‌ణ‌. విజ‌య్‌కాంత్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో ఆషియాభ‌ల్లా (చిరు డాడీ ఫేం) హీరోయిన్‌గా న‌టించింది. ర‌మ‌ణ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం హీరో రాజ‌శేఖ‌ర్ ముందుగా అక్క‌డ నిర్మాత‌ల‌ను సంప్ర‌దించారు.

అయితే అప్పుడు పోటీ లేక‌పోవ‌డంతో అక్క‌డ నిర్మాత‌లు ఆ రీమేక్ రైట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. అయితే అగ్రిమెంట్ అప్ప‌ట‌కీ కుద‌ర్లేదు. ఈ లోగా ఈ సినిమా చిరు రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని కొంద‌రు ఆయ‌న‌కు స‌ల‌హా ఇవ్వ‌డం.. వెంట‌నే చిరు ర‌మణ చూడ‌డం.. ఆయ‌న ఓకే చెప్పేయ‌డం.. అల్లు అర‌వింద్ మంత్రాంగం చేసి ర‌మ‌ణ తెలుగు రీమేక్ రైట్స్ లియో ప్రాజెక్ట్ మ‌ధుకు ద‌క్కేలా చేశారు. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా చూసి న‌చ్చింద‌నుకుని అగ్రిమెంట్ చేసుకునే లోప‌లే ఇదంతా జ‌రిగిపోయింది.

ఇదే రాజ‌శేఖ‌ర్‌, చిరు మ‌ధ్య వైరానికి తొలి బీజంగా మారింది. అయితే ఈ గొడ‌వ‌కు చిరుకు సంబంధం లేదు. ఆయ‌న ప్ర‌మేయం లేకుండానే తెర‌వెన‌క క‌థ న‌డిచింది. చిరు న‌టిస్తార‌ని చెప్ప‌డంతో ర‌మ‌ణ నిర్మాత‌లు కూడా ఆ రైట్స్ లియో ప్రాజెక్ట్ మ‌ధుకే ఇచ్చారు. ఆ త‌ర్వాత ర‌మ‌ణ‌ను తెలుగులో రీమేక్ చేస్తే సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకువ‌చ్చింది. అప్ప‌టి నుంచే రాజ‌శేఖ‌ర్ చిరు మ‌ధ్య స్టార్ట్ అయిన గొడ‌వ‌లు చిరు పార్టీ పెట్టిన‌టైంకు పీక్స్ కు చేరుకున్నాయి.

రాజ‌శేఖ‌ర్ చిరుపై చివ‌ర‌కు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయినా చిరు మాత్రం వాటిని ప‌ట్టించుకోలేదు. ఇక రాజ‌శేఖ‌ర్ గ‌తంలో జెంటిల్‌మ‌న్‌, వెంకీ హీరోగా వ‌చ్చిన చంటి సినిమాల రీమేక్‌ల‌ను కూడా వ‌దులుకోవాల్సి వ‌చ్చిందని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news