Moviesఅనుష్క-ప్రభాస్ ల పెళ్లి జరగదు..టంగ్ స్లిప్ అయిన కృష్ణం రాజు భార్య..?

అనుష్క-ప్రభాస్ ల పెళ్లి జరగదు..టంగ్ స్లిప్ అయిన కృష్ణం రాజు భార్య..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైన ఉంది అంటే అది..ఫ్రభాస్ పెళ్లి. కేవలం ఆయన అభిమానులే కాదు బడా స్టార్స్ కూడా ప్రభాస్ ఓ ఇంటి వాడు అయితే చూడాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఒక్కటి అడగకండి అన్నట్లు..పెళ్లి అంటేనే తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ మధ్య రాధ్యేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు..ఇదే ప్రశ్న ఆయనకు ఎదురవ్వగా..లవ్ ఫెయిల్యూర్ అంటూ చెప్పి మాట దాటేశాడు.

దీంతో మళ్ళీ ప్రభాస్-అనుష్క పేరు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. వీళ్ళ జంట బాగుంటుంది..తెర పై రొమాన్స్ కూడా బాగా పండుతుంది.. అంత మాత్రానా వీళ్లు పపెళ్లి చేసుకోవాలని లేదు..కానీ చేసుకుంటే చూడాలి అనేది అభిమానుల కోరిక. దానికి తగ్గట్లే అప్పట్లో వీళ్లు ఇద్దరు కలిసి ఏ ఫంక్షన్ కి వెళ్లినా .. వీళ్లు లవ్ లో ఉన్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అప్పుడేంటి..ఇప్పుడు కూడా అలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం.

కానీ, ప్రభాస్-అనుష్క మాత్రం..మా మధ్య అలాంటిది ఏం లేదురా బాబోయ్ అంటూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఆ విషయమే చెప్పుకొచ్చింది ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య శ్యామ‌ల దేవి. ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..” ప్రభాస్ కి మన పద్ధతులు అన్నా, సాంప్రదాయాలు అన్నా చాల ఇస్టం ..గౌరవం. మ‌హిళంటే ప్రత్యేకమైన గౌర‌వం ఉంది. కుటుంబానికి కుటుంబ విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ..”ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు”..అంటూ చెప్పుకొచ్చింది. ఇక అప్పుడు ఆమెకు అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళేనే అని అడగా..”ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. మీకు త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి” అంటూ సమాధానమిచ్చింది. ఇక దీని బట్టి ప్రభాస్ పెళ్లి పనులు బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతూనే ఉన్నాయి..కానీ బయటకు రానివ్వడం లేదు అంతే..అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైతేనేం .. ప్రభాస్ పెళ్ళి వార్త త్వరలోనే వినబోతున్నాం అని శ్యామ‌ల దేవి చెప్పకనే చెప్పేసింది. హ్యాపీ..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news