Moviesగీతా ఆర్ట్స్‌లో మెగాస్టార్ - స్టైలీష్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌... అదిరిపోయే టైటిల్‌, డైరెక్ట‌ర్...

గీతా ఆర్ట్స్‌లో మెగాస్టార్ – స్టైలీష్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌… అదిరిపోయే టైటిల్‌, డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోలు గ‌తంలోనే మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. ఇక రాజ‌మౌళి తెలుగు సినీ అభిమానులు క‌నీసం క‌ల‌లోనే ఊహించ‌ని విధంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో త్రిబుల్ ఆర్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్‌లో కుర్ర హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతారు. ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా కాంబోలో భీమ్లానాయ‌క్ సినిమా కూడా వ‌చ్చింది.

ఏదేమైనా పెద్ద హీరోలు, కుర్ర హీరోలు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌డం టాలీవుడ్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌నే చెప్పాలి. ఇక అక్కినేని ఫ్యామిలీ సినిమా మ‌నం కూడా వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీ వాళ్లు మెగా ఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ మల్టీస్టార‌ర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి రెండు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల న్యూస్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ కాంబోలో కోలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌గా సినిమా వ‌స్తోంద‌న్న ప్ర‌చారం బ‌యట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్‌, సాయి కాంబోలో సినిమా అన‌గానే ఫుల్ జోష్‌లో ఉన్న మెగాభిమానులు పండ‌గ చేసుకునే మ‌రో గుడ్ న్యూస్ వ‌చ్చేసింది.

అదే మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌. ఈ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు శ్రీకాంత్ అడ్డాల‌. గ‌తంలో కొత్త బంగారులోకం, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల‌తో త‌న‌దైన మార్క్ వేసిన శ్రీకాంత్ మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్‌తేజ్ ముంద‌కు సినిమాకు కూడా ద‌ర్శ‌కుడు. అయితే మ‌హేష్‌బాబుతో శ్రీకాంత్ చేసిన బ్ర‌హ్మోత్స‌వం మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌ర్వాత శ్రీకాంత్‌ను ఏ హీరో కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. దీంతో త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకునేందుకు వెంక‌టేష్‌తో నార‌ప్ప సినిమా చేశాడు.

ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వ‌డంతో పాటు అనుకున్నంత రేంజ్‌లో రెస్పాన్స్ లేక‌పోవ‌డంతో శ్రీకాంత్‌కు ఇప్పుడు త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే నార‌ప్ప టైంలోనే శ్రీకాంత్ అన్నాయ్ అనే టైటిల్‌తో ఓ క‌థ రెడీ చేసుకున్నాడు. ఈ క‌థ‌ను గీతా ఆర్ట్స్‌కు చెప్ప‌డంతో అల్లు అర‌వింద్‌కు సైతం క‌థ న‌చ్చింది. అర‌వింద్ కూడా క‌థ రెడీ చేసుకుర‌మ్మ‌ని బ‌న్నీ – చిరు డేట్లు తాను ఎడ్జెస్ట్ చేస్తాన‌ని చెప్పారు.

అయితే శ్రీకాంత్ ఈ క‌థ మీద మ‌రింత క‌స‌ర‌త్తులు చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. అస‌లే బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత పెద్ద హీరోలు న‌మ్మ‌ని ప‌రిస్థితి. ఈ క‌థ మ‌రింత స్ట్రాంగ్‌గా చేసుకున్నాకే చిరు, బ‌న్నీకి వినిపించాల‌ని క‌సితో ఉన్నాడ‌ట‌. శ్రీకాంత్ ఈ క్రేజీ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేస్తే అంత‌కు మించిన సంచ‌ల‌నం ఉండ‌దేమో ? మ‌రి ఇప్పుడు ఈ ల‌క్కీ ఛాన్స్ వ‌చ్చిన శ్రీకాంత్ దీనిని ఎంత వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుంటాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news