Moviesయూఎస్‌లో R R R హంగామా అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌దే.. ఈ...

యూఎస్‌లో R R R హంగామా అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌దే.. ఈ కొత్త ర‌చ్చేంట్రా బాబు..!

మూడేళ్లు ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? సినిమా ఎలా ఉంటుందా ? అని తెలుగు సినీ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాదు.. పాన్ ఇండియా సినిమా ప్రేక్ష‌కులు అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన త్రిబుల్ ఆర్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు 14 రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓవ‌రాల్‌గా రు. 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్‌.. రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న జ‌ర్నీ స్టార్ట్ చేస్తోంది.

టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియా వైజ్‌గా మోస్ట్ అవైటైడ్ మూవీగా అంచ‌నాలు ఉన్న ఈ రౌద్రం రణం రుధిరం లో ఇద్ద‌రూ టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఉండ‌డం ఇప్పుడు హైలెట్‌. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డం ఓ ఎత్తు అయితే… చ‌రిత్ర‌లోనే ఎంతో పేరున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, గోండు వీరుడు కొమ‌రం భీం చ‌రిత్ర‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కిన కాల్ప‌క సినిమా కావ‌డం ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్‌.

అటు ఎన్టీఆర్ సినిమా వ‌చ్చి, ఇటు చ‌ర‌ణ్ సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మూడు సంవ‌త్స‌రాలు దాటేసింది. ఇక ఏపీ, తెలంగాణ‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఈ ఇద్ద‌రు హీరోల అభిమానులు భారీ హంగామా స్టార్ట్ చేసేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం హంగామా విష‌యంలో ఒక‌డుగు ముందే ఉంటున్నారు. ఇప్ప‌టికే బ‌ల్క్‌లో టిక్కెట్లు బుక్ చేసేస్తున్నారు. ఓవ‌ర్సీస్‌లో ఓ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా 75 టిక్కెట్లు బుక్ చేసి సంచ‌ల‌నం రేపాడు.

ఆ త‌ర్వాత మ‌రి కొంద‌రు ఎన్టీఆర్ అభిమానులు సైతం బ‌ల్క్‌లో టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. టెక్సాస్ లో ఓ ఎన్టీఆర్ అభిమాని.. ఏకంగా ఓ షో టిక్కెట్లు మొత్తం బుక్ చేసేశాడు. ఇక అక్క‌డ ప్ర‌మోష‌న్ల విష‌యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో చాలా గ్రాండ్‌గా వెల్‌కం ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఓ పెద్ద మాల్‌లో స్పెష‌ల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి దానిపై అదిరిపోయే రేంజ్‌లో ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఆ హోర్డింగ్‌పై కేవ‌లం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌నే ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర‌చ్చ 15 రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది. రేపు సినిమా రిలీజ్ వేళ ఇది ఇంకే రేంజ్‌లో ఉంటుందో ? చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news