MoviesRRR: సెకండాఫ్‌లో వచ్చే ఆ సీన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

RRR: సెకండాఫ్‌లో వచ్చే ఆ సీన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

దర్శక ధీరుడు రాజమౌళి అంటే అభిమానులకు ఓ నమ్మకం. ఆయన సినిమా తెరకెక్కిస్తే ఖచ్చితంగా అది మన ఇండియ ప్రజలు గర్వించదగ్గ సినిమా అయ్యి ఉంటాది అని. అపజయం ఎరుగని దర్శకునిగా తనకంటూ ఆయన ఓ స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్నారు. ఇక బాహుబలి సిరీస్ తో ఇండియా సినిమా ఎల్లలు దాటేసిన రాజమౌళి.. ఆర్ ఆర్ ఆర్ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”.

ఈగలతోనే హీరోయిజం పండించిన జక్కన్న..ఇద్దరు స్టార్ హీరోలతో పండించిన అద్భుత సృష్టి రౌద్రం రణం రుధిరాల మేళవింపు ఈ RRR. మొదట నుండి దర్శకధీరుడు రాజమౌళి చెప్పినట్టుగానే.. ఈ సినిమా కథ మనకి తెలియనిది కాదు. ఇండియ సినిమా చరిత్రలో ఇలాంటి స్వాతంత్ర సమర పోరాటం నేపథ్యంలో ఇప్పటివరకూ బోళెడు చిత్రాలు వచ్చాయి. కానీ, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం..ఒకటి ఉంది. మనకు తెలిసిన కధనే ..సరికొత్త యాంగిల్ లో .. జక్కన్న మార్క్ సెట్ చేస్తూ.. అందరిలా కాకుండా తనదైన ట్విస్టులు ఇచ్చాడు.

ఇలా రియాలిటీలో సంబంధం లేని ఈ రెండు పాత్రల్ని రీల్ లైఫ్‌లోకి ఒకేసారి తీసుకురావడంలోనే.. జక్కన్న బ్లాక్‌బస్టర్ మార్కులు కొట్టేశాడు. తెలిసిన కధే అయినా ఊహకందని రీతిలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని రంగంలోకి దింపాడు. నిజం చెప్పాలంటే మన చరిత్రలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇద్దరు వేరు వేరు టైం లైన్స్ లో ని వారు..కానీ వాళ్ల మధ్య వచ్చే ఫ్రెండ్ షిప్ సీన్లను..ఎమోషనల్ ఎలిమెంట్స్ ను బాగా తెరకెక్కించాడు రాజమౌళి.

సినిమాలో తారక్-చరణ్ ల మధ్య వచ్చే అన్నీ సీన్లను కన్విన్సింగ్‌గానే చూపించాడు. ఎక్కడా కూడా ఓ హీరో ని ఎక్కువ చేసి..మరో హీరో ని తక్కువ చేసిన్నట్లు తేడా కొట్టినట్టు కనిపించదు. ఎంతైనా అక్కడున్నది ఎవరు బాహుబలి ని తెరకెక్కించిన జక్కన.. ఒక్కో సీన్ ని శిల్పాన్ని చక్కగా చెక్కినట్టుగా ..RRR సినిమాని కూడా బాగా చెక్కారు. చెక్కడంలో గొప్ప నిపుణుడు అయుపోయాడు రాజమౌళి. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రిటీష్ వాళ్ళుపై తారక్-చరణ్ కలిసి చేసే పోరాట ఘట్టాల్ని కూడా చాలా బాగా తెరకెక్కించాడు జకన్న. సెకండాఫ్‌లో వచ్చే ఆ యాక్షన్ సీన్స్..విజువల్ వండర్స్ కి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. సినిమా చూసిన జనాలు కూడా రాజమౌళి యూనిక్‌గా ప్రెజెంట్ చేశారని.. తన చతురతని మరోసారి చాటి చెప్పాడు జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news