Moviesఆ సీన్ తో అందరి నోర్లు మూయించిన రాజమౌళి.. జక్కన్న నువ్వు...

ఆ సీన్ తో అందరి నోర్లు మూయించిన రాజమౌళి.. జక్కన్న నువ్వు కేక..!!

హమ్మయ్య..ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణ ముగిసింది. యావత్ దేశం ప్రజలు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న RRR చిత్రం కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ ముందు నుండే ఈ సినిమా పై ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకుని ఉన్న విషయం తెలిసిందే..ఆ అంచనాలను ఏ మాత్రం తీసిపోకుండా..రాజమౌళి సూపర్ సక్సెస్ అయ్యాడు. దాదాపు నాలుగేళ్లు ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఒక గొప్ప కథ తాలుకా లక్షణం ఏంటంటే.. కథా గమనంలో ప్రేక్షకుడ్ని లీనం చేయడం. ఇలాంటి కథల తాలుకా లక్షణాల వృక్షం రాజమౌళి. సినిమా ను ఎవ్వరైన తీస్తారు..కానీ అందరి ప్రజలకు నచ్చేలా మెచ్చేలా తీయ్యడమే రాజమౌళి స్పెషాలిటీ. వెండితెరపై ఓ సరికొత్త కధను ఆవిష్కరించే శిల్పి జక్కన్న. కాగా ఈ సినిమా ప్రధాన పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్, రాంచరణ్..నటన పరంగా కుమ్మేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరకు ఇద్దరే ఎక్కడ తగ్గకుండా..తెర పై విజృంభించేశారు.

ఈ సినిమా తెరకెక్కిస్తున్నప్పటి నుండి చాలా మంది భయపడారు. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ని మెప్పించగలడా రాజమౌళి..తేడా వస్తే దెబ్బైపోతాడు ఏమో అని..కొందరు ఈ సినిమా ఫ్లాప్ అయితే రాజమౌళి కి ఇక సినీ కెరీర్ ఉండదు అని కూడా అన్నారు. అలాంటి వాళ్ళ నోర్లు మూయించారు జక్కన్న. ఈ సినిమాలో తెర పై ఎన్టీఆర్, రాంచరణ్ ల మధ్య వచ్చే ఫ్రెండ్ షిప్ల సీన్స్ చూస్తే..అభిమానులు కూడా ఆశ్చర్యపోతారు. అంత బాగా తెరకెక్కించాడు జక్కన్న. ఎంత గ్రాఫిక్స్ మాయాజాలంతో జక్కన్న చిత్రం చెక్కినా.. అందులో భావోద్వేగాలకి ధీరోదాత్తతకి పెద్ద పీట వేస్తాడు. ఈ మధ్య కాలంలో ఇంత పర్ఫెక్ట్ మల్టీస్టారర్ రాలేదు. అది కూడా నందమూరి-మెగా ఫ్యామిలీ హీరోలు ఒక సినిమాలో నటించేలా చేయడం.. మరింత విశేషంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news