Moviesశ్రీహరికి అలా లైఫ్ ఇచ్చిన న‌ట‌సింహం బాల‌య్య‌.. వారిద్ద‌రి అనుబంధం ఇదే..!

శ్రీహరికి అలా లైఫ్ ఇచ్చిన న‌ట‌సింహం బాల‌య్య‌.. వారిద్ద‌రి అనుబంధం ఇదే..!

తెలుగు సినిమా పరిశ్రమలోని హీరోల గురించి ప్రస్తావన వస్తే అందులో మనం కచ్చితంగా రియల్ హీరో శ్రీహరి గురించి మాట్లాడకుండా ఉండలేం. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా పైకొచ్చిన నటుల్లో శ్రీహరి ఒకరు. శ్రీహరి కెరీర్ లో విలన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. కమెడియన్ గా…డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్ చేసే అసలైన హీరోగా శ్రీహరి మంచి పేరు సంపాదించారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా శ్రీహరి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే…బట్ శ్రీహరి చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నప్పటికి ఏదోక సందర్భంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ శ్రీహరిని గుర్తుచేస్కుంటూనే ఉంటారు.

గ‌తేడాది నందమూరి బాలకృష్ణ సైతం శ్రీహరిపై ఎమోషన్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ నటించిన ‘నర్తనశాల’ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య శ్రీహరితో త‌నకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బాలయ్య హీరోగానే కాకుండా దర్శకుడిగా మారి నిర్మించాలనుకున్న సినిమా నర్తనశాల. ఈ సినిమాలో బాలకృష్ణ అర్జునుడిగా, నటి సౌందర్య ద్రౌపదిగా నటించగా రియల్ స్టార్ శ్రీహరి భీముడి పాత్ర పోషించారు..అయితే శ్రీహరినే భీముడిగా ఎందుకు తీసుకున్నామనే విషయాన్ని బాలకృష్ణ ముక్కుసూటిగా చెప్పేసారు.

శ్రీహరిని భీముడి పాత్రకు ఎంపిక చేయడానికి అతడి టాలెంటే కారణమని, ఇంకా అతని ఫిజిక్ కూడా చాలా బావుంటుందని.. కొందరికి టాలెంట్ ఉంటే ఫిజిక్ ఉండదని.. ఫిట్నెస్ ఉంటే టాలెంట్ ఉండదన్నారు. శ్రీహరికి ఈ రెండు సమపాళ్లలో ఉన్నాయని బాలకృష్ణ శ్రీహరిని గుర్తుచేసుకున్నారు.
అంతేకాదు శ్రీహరి చాలా మంచి మనిషి.. ఎదుటి మనిషిని ఎంతగానో గౌరవిస్తారని..అందుకే శ్రీహరి అంటే నాకిష్టం.. ఇంకా ఇండస్ట్రీలో తనకు చాలా తక్కువమంది స్నేహితులు ఉన్నారని అందులో శ్రీహరి ఒకరని బాలయ్య చెప్పుకొచ్చారు.

తనకు చాలా దగ్గరి ఆత్మ బంధువు అంటూ బాలకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే బాలకృష్ణ యువరత్న రాణా అనే సినిమాలో శ్రీహరి గారు కేశవ అనే పాత్రలో నటించారు.. అప్పుడు బాలయ్య బాబే కేశవ పాత్ర చేస్తే నీ కెరీర్ మారుతుందని శ్రీహరికి చెప్పరట..ఆ తర్వాత అతడు హీరోగా సక్సస్ అయ్యాడని బాలయ్య తెలిపాడు. శ్రీహరి వద్దకు ఎవరైనా అవకాశం కోసం వస్తే మీరు వెళ్లి బాలకృష్ణ దృష్టిలో పడండి అంటూ చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. బాలయ్య అవకాశం ఇస్తే మీ జీవితమే మారిపోతుని
చెప్పేవాడని తెలిపారు. అది శ్రీహరి మంచితనమని.. ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలిసిన మనస్సున్న వ్యక్తి శ్రీహరి అంటూ బాలయ్య శ్రీహరి గారిని గుర్తుచేసుకున్నారు.

ఇక నర్తనశాల సినిమాలో బాలయ్య బాబు అర్జునుడుగా, కృష్ణుడుగా ద్విపాత్రాభినయం చేయాలనుకున్నారు. ఇక భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు, దుర్యోధనుడిగా సాయికుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్‌, నకుల సహదేవులుగా నవీన్‌, వినయ్ నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు అప్పట్లో పిక్చరైజ్ చేశాడు బాలకృష్ణ. దాని నిడివి దాదాపు 17 నిమిషాలు ఉంటుంది. అయితే ఏప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది.

అందులో ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా సజీవ దహనమయ్యాడు. దీంతో నర్తనశాలలో ద్రౌపది పాత్రలో సౌందర్యను కాక వేరే నటిని ఊహించుకోవడానికి ఇష్టపడని బాలయ్య.. ఈ సినిమాను ఆపేసారు. మధ్యలో ద్రౌపది పాత్రలో గ్రేసీ సింగ్‌‌ను అనుకున్నారు. ఆ తర్వాత నయనతారతో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో బాలయ్య మనసు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ప్యాకప్ చెప్పేసాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news