MoviesCNN - IBN స‌ర్వేలో సీనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మ‌తులు...

CNN – IBN స‌ర్వేలో సీనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే మ‌తులు పోయి మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ చ‌రిత్ర‌లో విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ సీనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్‌, రేంజ్ గురించి తెలిసిందే. ఎన్టీఆర్ మ‌న‌ల‌ను వీడి వెళ్లి రెండున్న‌ర ద‌శాబ్దాలు అవుతున్నా కూడా ఇప్ప‌ట‌కీ ఆయ‌నంటే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఓ ఆరాధ్య‌దైవ‌మే. సినీ రంగంలోనే కాదు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన ఘ‌న‌త‌.. అందులోనూ పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కి దేశ రాజ‌కీయాల్లో తిరుగులేని రికార్డులు నెల‌కొల్పిన చ‌రిత్ర ఎన్టీఆర్‌కే సొంతం.

ఎన్టీఆర్ త‌న కీర్తి కిరీటంలో ఎన్నో రికార్డులు లిఖించుకున్నారు. భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర 100 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సీఎన్ ఎన్ – ఐబీఎన్ వారు ఓ స‌ర్వే చేశారు. ఈ స‌ర్వే ప్ర‌కారం భార‌త ప్ర‌ఖ్యాత న‌టుడిగా 53 % ఓట్ల‌తో అన్న‌గారు మొద‌టి స్థానంలో నిలిచారు. భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో ఎంతోమంది హీరోలు ఉంటారు. అయితే మొత్తం పోలైన ఓట్ల‌లో కేవ‌లం 53 % ఓట్లు ఎన్టీఆర్‌కు వ‌స్తే… మిగిలిన 47 % శాతం ఓట్లు ఇత‌ర హీరోల‌కు వ‌స్తాయి.

ఇలాంటి గొప్ప రికార్డు దేశంలో ఏ హీరోకు మాత్రం దక్కుతుంది. అలాగే ఇదే అంశంపై ఎన్డీటీవీ నిర్వ‌హించిన స‌ర్వేలో 73 % ఓట్ల‌తో ఎన్టీఆర్ మ‌రోసారి మొద‌టి స్థానంలో నిలిచారు. మొత్తం పోలైన ఓట్ల‌లో మిగిలిన హీరోలు ద‌రిదాపుల్లో లేకుండా ఈ రేంజ్‌లో ఓట్లు వ‌చ్చాయంటే ఎన్టీఆర్ అంటే తెలుగు జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉందో. ఆయ‌న తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఎలా నిలిచిపోయారో తెలుస్తోంది.

ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో సాధించిన అవార్డుల్లో కొన్ని మ‌చ్చుతున‌క‌కు మాత్రం ఈ కింద ఇస్తున్నాం..
1954 – ఉత్త‌మ న‌టుడు, భార‌త రాష్ట్ర‌ప‌తి అవార్డు
1954 – నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1960 – నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1963 – ఉత్త‌మ న‌టుడు, భార‌త రాష్ట్ర‌ప‌తి అవార్డు
1968 – నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు
1972 – ఉత్త‌మ న‌టుడు, ఫిల్మ్ ఫెయిర్ సౌత్‌
1974 – నంది అవార్డు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం
1978 – ఆంధ్రా యూనివ‌ర్సిటీ డాక్ట‌రేట్‌

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news