Moviesత‌గ్గేదేలే.. ఆ హీరోతో రొమాంటిక్ ప్రేమ‌లో స‌మంత‌...!

త‌గ్గేదేలే.. ఆ హీరోతో రొమాంటిక్ ప్రేమ‌లో స‌మంత‌…!

విడాకుల త‌ర్వాత స్టార్ హీరోయిన్ స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రింత‌గా రెచ్చిపోతోంది. ఇటు సినిమాల విష‌యంలో కాని.. అటు అందాల ఆర‌బోత‌లో కాని.. స‌మంత జోరు మామూలుగా లేదు. విడాకుల త‌ర్వాత బాలీవుడ్ ఛాన్సులు, హాలీవుడ్‌లో ఛాన్సులు.. బోల్డ్ వెబ్‌సీరిస్‌లు ఇలా ఎక్క‌డ చూసినా స‌మంత సంద‌డే క‌నిపిస్తోంది. ఇక విడాకుల త‌ర్వాత స‌మంత ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కూడా ఫుల్‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది.

కోలీవుడ్‌లో కార్తీ హీరోగా కూడా న‌టించే ఓ సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే స‌మంత రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించేందుకు రెడీ అయిన‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో విజ‌య్ – స‌మంత క‌లిసి మ‌హాన‌టి సినిమాలో న‌టించారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బయోపిక్ మ‌హాన‌టిలో విజ‌య్ దేవ‌ర‌కొండ – స‌మంత రొమాన్స్ మామూలుగా సాగ‌లేదు.

సావిత్రి చ‌రిత్ర కోసం సినిమాటోగ్రాఫ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత సావిత్రి జీవితంపై రీసెర్చ్ చేసే పాత్రికేయురాలిగా క‌నిపించింది. అయితే ఈ సినిమాలో క‌థ‌ను ట్రావెల్ చేయించే పాత్ర‌లే వీరివి. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి పూర్తి స్థాయిలో రొమాన్స్ చేసే సినిమా రాబోతోంది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఓ అదిరిపోయే రొమాంటిక్ ల‌వ్ స్టోరీ కోసం క‌థ రెడీ చేశాడ‌ట‌.

వీరిద్ద‌రి కాంబినేష‌న్లోనే ఈ సినిమాను తెర‌మీద‌కు తీసుకు రావాల‌ని శివ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. శివ నేచుర‌ల్ స్టార్ నానితో ట‌క్ జ‌గ‌దీష్ అనే ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. ఇక విజ‌య్ పూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే ఈ క్రేజీ ప్రాజెక్టు ప‌ట్టాలు ఎక్కుతుంద‌ని తెలుస్తోంది.

ఇక విజ‌య్ ప‌క్క‌న న‌టించే స‌మంత‌కు శివ స్టోరీ చెప్ప‌గా ఆమె కూడా ఓకే చెప్పిందంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు త‌న బ్యాన‌ర్లో నిర్మించేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి విడాకుల త‌ర్వాత స‌మంత ఈ రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో ఎంత ఘాటు ప్రేమ ఒల‌క‌బోస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news