Moviesప్ర‌భాస్ - అనుష్క మ‌ళ్లీ ఫిక్స్‌.. ఆ డైరెక్ట‌ర్ మామూలు స్కెచ్...

ప్ర‌భాస్ – అనుష్క మ‌ళ్లీ ఫిక్స్‌.. ఆ డైరెక్ట‌ర్ మామూలు స్కెచ్ వేయ‌లేదే…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజాగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన రాధేశ్యామ్ అంచ‌నాలు అందుకోలేదు. పైగా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది. రాధేశ్యామ్ ప్లాప్ అవ్వ‌డం ఒక మైన‌స్ అయితే.. మ‌రీ ఘోరంగా.. ఇండియ‌న్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టి అయిపోయింది. నిజంగా బాహుబ‌లి సీరిస్ సినిమాలు, సాహో లాంటి పాన్ ఇండియా హిట్లు త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి ఆయ‌న అభిమానులు కూడా కోరుకున్న సినిమా ఇది కానే కాదు.

రాధేశ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ వ‌రుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ – స‌లార్ 1,2 – ప్రాజెక్ట్ కే ఉన్నాయి. ఇక మ‌ధ్య‌లో మారుతితో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా ? కాదా ? అన్న‌ది క్లారిటీ లేదు. పైగా ఈ సినిమాకు కేవ‌లం 50 రోజులు మాత్ర‌మే కాల్షీట్లు ఇచ్చాడ‌ని అంటున్నారు. ఇదో మాస్ మ‌సాలా ఎంటర్టైన‌ర్ అని.. ముగ్గురు హీరోయిన్లు ఉండ‌బోతున్నార‌ని అంటున్నారు.

ఈ ముగ్గురు హీరోయిన్ల‌లో ఒక‌రు అనుష్క శెట్టి అని లేటెస్ట్ టాక్‌. ప్ర‌భాస్ – అనుష్క కాంబినేష‌న్ అంటేనే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. బిల్లా – బాహుబ‌లి 1, బాహుబ‌లి 2, మిర్చి ఇలా చాలా సూప‌ర్ హిట్లు ఉన్నాయి. ఇప్పుడు అనుష్క‌లో ఎంత ముదురు చాయ‌లు క‌న‌ప‌డుతున్నా…. ఫేడ‌వుట్ అయినా కూడా ఆమె – ప్ర‌భాస్ కాంబినేష‌న్ అంటే మామూలు ర‌చ్చ ఉండ‌దు. మార్కెట్ వ‌ర్గాల్లోనూ, ఇటు ప్రేక్ష‌కుల్లోనూ క్రేజ్ ఉంది.

దానినే మారుతి క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ కాంబినేష‌న్ మ‌రోసారి సెట్ అవుతుందా ? అన్న సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ దీనిని సెట్ చేస్తున్నాడు. ఇదే కాంబినేష‌న్ సెట్ చేస్తే అంత‌కు మించిన హ్యాపీ ఏం ఉంటుంది. ఇక మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అదిరిపోయే ఎలిమెంట్స్ రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి మారుతి కూడా స్పందించాడు. టైం వ‌చ్చిన‌ప్పుడు అన్ని బ‌య‌ట పెడ‌తాన‌ని చెప్పారు. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాన‌య్య ప్ర‌భాస్‌కు సింగిల్ పేమెంట్‌లో రు. 75 కోట్లు ఇచ్చిన‌ట్టు కూడా టాక్ ? ఈ సినిమాను హిట్ చేస్తే మారుతి ఫేట్ మారిపోయిన‌ట్టే…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news