Moviesమెగాస్టార్ మ‌ర‌ద‌లిగా బ‌న్నీ ల‌వ‌ర్‌... ఆ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌..!

మెగాస్టార్ మ‌ర‌ద‌లిగా బ‌న్నీ ల‌వ‌ర్‌… ఆ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌..!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వ‌చ్చే నెల 29న చిరు న‌టించిన ఆచార్య సినిమా రిలీజ్ అవుతోంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తోన్న భోళా శంక‌ర్ సినిమాతో పాటు మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న గాడ్ ఫాద‌ర్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు త‌న 154వ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అన్న టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

ఈ సినిమా కంప్లీట్ ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్క‌తోంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి మ‌ర‌ద‌లిగా బ‌న్నీ ప్రేయ‌సి క‌నిపించ‌బోతోంద‌ట‌. బ‌న్నీ ప్రేయ‌సి ఏంటి చిరుకు మ‌ర‌ద‌లు ఏంట‌నుకుంటున్నారా ? ఈ సినిమాలో చిరుకు సోద‌రుడిగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా న‌టించబోతున్నాడు. మెగాస్టార్‌కు జోడీగా శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ర‌వితేజ‌కు జోడీగా మాళ‌విక మోహ‌న‌న్‌ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పేరు మారింది.

 

 

కేథ‌రిన్ థెస్రాను ర‌వితేజ‌కు జోడీగా తీసుకోవ‌డంతో పాటు ఆమె – ర‌వితేజ‌పై కొన్ని సీన్లు కూడా చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. కేథ‌రిన్ థెస్రా బ‌న్నీతో రెండు, మూడు సినిమాలు చేసింది. రుద్ర‌మ‌దేవి, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, స‌రైనోడు సినిమాలో కూడా ఆమె బ‌న్నీ ప‌క్కన న‌టించింది. స‌రైనోడు సినిమాలో లేడీ యంగ్ ఎమ్మెల్యేగా ఆమె – బ‌న్నీ కాంబోలో సీన్లు అదిరిపోయాయి.

అల్లుడు ప‌క్క‌న వ‌రుస సినిమాలు చేసిన కేథరిన్ ఇప్పుడు ఏకంగా మామ‌కు మ‌ర‌ద‌లు అయిపోయింది. మ‌రి చాలా రోజుల నుంచి స‌రైన ఛాన్సులు లేకుండా ఉన్న కేథ‌రిన్‌కు ఈ వాల్తేరు వీర‌య్య అయినా లైఫ్ ఇస్తుందేమో ? చూడాలి. ఈ సినిమాని మైత్రీమూవీస్ వారు నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news