Moviesరాఖీ క‌ట్టిన వ్య‌క్తినే శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది... ఆమెను మోసం...

రాఖీ క‌ట్టిన వ్య‌క్తినే శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకుంది… ఆమెను మోసం చేసిన స్టార్ హీరో…!

అతిలోక సుంద‌రి శ్రీదేవి పేరు చెపితే 20 – 30 ఏళ్ల క్రితం ఇండియా అంతా ఊగిపోయేది. త‌మిళంలో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి పాపుల‌ర్ అయ్యింది మాత్రం టాలీవుడ్లోనే..! తెలుగులో అప్ప‌ట్లో శ్రీదేవి ఎన్టీఆర్ – ఏఎన్నార్ – శోభ‌న్‌బాబు – కృష్ణ లాంటి స్టార్ హీరోల‌తో ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించింది. ఆమె ఎంత నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయినా కూడా ఆమె ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్న‌ది మాత్రం తెలుగులోనే.. తెలుగులో ఇప్ప‌ట‌కీ ప్ర‌తి ఇంట్లోనూ ఆ త‌రం సినీ అభిమానుల్లో ఒక‌రు అయినా శ్రీదేవి అభిమానులు ఉంటారు.

సౌత్ ఇండియాను ఆమె ఏలేస్తోన్న టైంలోనే ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ ఒక‌టి రెండు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చి అవి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఒక్క‌సారిగా బాలీవుడ్ అటెన్ష‌న్ అంతా శ్రీదేవి వైపు మ‌ళ్లింది. బాలీవుడ్‌లోకి వెళ్లిన‌ప్పుడు శ్రీదేవి కెరీర్ స్టార్టింగ్‌లో మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ఎక్కువ సినిమాలు చేసింది. అత‌డిని విడిచి ఉండ‌లేని స్టేజ్‌కు శ్రీదేవి వెళ్లిపోయింది. అప్ప‌టికే మిథున్‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉన్నారు. శ్రీదేవితో మిథున్‌కు ఎఫైర్ ఉంద‌న్న ప్ర‌చారం తెలియ‌డంతో మిథున్ భార్య ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం కూడా చేసింది.

ఆ టైంలో మిథున్ శ్రీదేవిని వ‌దిలేసి అత‌డి భార్య ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు. అస‌లు శ్రీదేవి – మిథున్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఏదేమైనా మిథున్ త‌న‌ను ఒంట‌రిగా వ‌దిలేసి వెళ్లిపోవ‌డంతో ఆ టైంలో బోనీక‌పూర్ శ్రీదేవితో ఎక్కువుగా సినిమాలు నిర్మించాడు. ఆమెకు ద‌గ్గ‌రై ఆమెను ఓదార్చేవాడు. అప్పుడు వీరిద్ద‌రిపై అనుమానం వ‌చ్చిన మిథున్ మ‌ళ్లీ శ్రీదేవి లైఫ్‌లోకి ఎంట‌రై బోనీకి రాఖీ క‌ట్ట‌మ‌ని చెప్పి ఆమెతో బోనీకి రాఖీ క‌ట్టించాడు.

శ్రీదేవి మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌ని చెప్పినా మిథున్ వినిపించుకోలేదు. ఆ త‌ర్వాత మిథున్ చేసిన మోసం క్ర‌మంగా తెలుసుకున్న శ్రీదేవి బోనీక‌పూర్‌కు ద‌గ్గ‌రైంది. అప్ప‌టికే బోనీక‌పూర్‌కు కూడా పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్నారు. అయినా మిథున్ చేసిన మోసంతో బోనీ ఇచ్చిన ఓదార్పుతో అత‌డికి ద‌గ్గ‌రై పెళ్లికి ముందే గ‌ర్భం దాల్చింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రీదేవి 2018లో ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లోని ఓ హోట‌ల్ బాత్‌రూమ్‌లో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news