Moviesచరణ్ కోసం రంగలోకి దిగ్గిన పవన్ డైరెక్టర్..ఇప్పుడు కధలో అసలు మజా..?

చరణ్ కోసం రంగలోకి దిగ్గిన పవన్ డైరెక్టర్..ఇప్పుడు కధలో అసలు మజా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఒక్క సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే మరో సినిమాకు సంతకం చేస్తూ..కెరీర్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ లెక్కన ఆయన మన ముందుకు బిగ్గెస్ట్ సినిమాలతో అలరించదానికి రెడీ అవుతున్నారు.

వరుస పాన్ ఇండియా సినిమాలతో హుషారెత్తించబోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేసిన ఆయన.. ఆచార్య సినిమాలో కూడా నటించారు. అంతేనా మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కీయార అద్వానీ నటించడం సినిమా కి మరో ప్లస్ పాయింట్.

ఎవడు దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. చెర్రీ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ – నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరుపుకుంటుంది.

 

అయితే ఈ సినిమాకు సంబంధించి అద్దిరిపోయే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమా అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ని శంకర్ ఎంపిక చేసినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త టాక్ నడుస్తోంది.

అతనెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. నటుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ తో ఖుషి, కొమరం పులి చిత్రాలను తెరకెక్కించి మెప్పించిన ఎస్ జె సూర్య.. ప్రస్తుతం డైరెక్టర్ కన్నా కూడా నటన వైపే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆయన ఏకంగా మెయిన్ విలన్ రోల్ లో కనిపించనున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇది చాలా పవర్ ఫుల్ విలన్ పాత్ర కావడంతో సూర్య నో చెప్పే ఛాన్స్ లేకుండా పోయారట. అందుకే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక రేపో మాపో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news