Moviesఅమ్మ బాబోయ్..ఒక్క కాల్ షీట్ కు అన్ని లక్షలా..ప్రియమణి రేటు కు...

అమ్మ బాబోయ్..ఒక్క కాల్ షీట్ కు అన్ని లక్షలా..ప్రియమణి రేటు కు నిర్మాతలు షాక్?

ప్రియమణి..ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో కుర్రాళ్లను మైమరపించి..ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. కేరళకు చెందిన ప్రియమణి 2003లో వచ్చిన ఎవరే అతగాడు? చిత్రంతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత హిట్ ఫ్లాప్ సినిమాలు అంటూ తేడా లేకుండా అన్ని సినిమాలల్లో నటించింది. ఓ పక్క సీనియర్ హీరోలతో జత కదుతూనే మరో వైపు కూర హీరోలతో కూడా నటించి..ఇద్దరికి మంచి జోడిగా పేరు తేచ్చుకుంది.

ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు వేసింది. కోలీవుడ్ లో కూడా అమ్మడుకు మంచి మార్కెట్ ఉంది. అంతేకాదు.. నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే సడెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ..జోరు మీదున్న ప్రియమణి కెరీర్ కు బ్రేక్లు పడ్డాయి. వరుస ప్లాపులతో భారీ డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

దీంతో అమ్మడు పని అయిపోయింది అని అనుకున్నారు అందరు. ఇక అప్పుడు కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి..ముస్తఫా అనే అబ్బాయిని పెళ్ళి చేసుకుని..మళ్లీ సినిమాలోకి రీ ఎమట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగిస్ లో బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తున్న ప్రియమణికి..వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నిండ్స్‌ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తోంది ఈ భామ.

నిన్నమొన్నటిదాకా ఢీ డాన్స్ షో తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియమణి తాజాగా ఇప్పుడు ఆహా వీడియోలో “భామాకలాపం” అంటూ సస్పెన్స్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రియమణీ నటన అందరిని ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో అమ్మడుకి మరిన్నీ ఆఫర్స్ తలుపు తట్టాయి.

ఇక అమ్మడు ఊరుకుంటుందా..అమాంత రెమ్యూనరేషన్ ను పెంచేసింది. ఈ వెబ్ సిరీస్ కి గాను ప్రియమణి రోజుకు దాదాపు 1.5 లక్షల రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఏకంగా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. కాగా ప్రస్తుతం ప్రియమణి.. రానా తాజా చిత్రం విరాటపర్వం సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news