Moviesబాల‌య్య కోరిక తీర్చ‌లేన‌న్న మ‌హేష్‌.. సిగ్గుప‌డుతూ... (వీడియో)

బాల‌య్య కోరిక తీర్చ‌లేన‌న్న మ‌హేష్‌.. సిగ్గుప‌డుతూ… (వీడియో)

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షో ఫ‌స్ట్ సీజ‌న్ కంప్లీట్ అవుతోంది. ఈ ఫ‌స్ట్ సీజ‌న్‌ను మ‌హేష్‌బాబు ఎపిసోడ్‌తో ముగించేసి.. ఆ త‌ర్వాత గ్యాప్ తీసుకుని రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్టు ఆహా టీం కూడా ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చింది. ఇక సంక్రాంతికి ముందే షూటింగ్ కంప్లీట్ అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వ‌లేదు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు వ‌స్తుందా ? అని ఆహా షో అభిమానులు, అటు మ‌హేష్‌, ఇటు బాల‌య్య అభిమానులు సైతం వెయిట్ చేస్తూ ఉన్నారు.

అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఈ రోజు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌పై ఆహా టీం ప్రోమోతో క్లారిటీ ఇచ్చేసింది. ఈ రోజు ప్రోమోలో బాల‌య్య మ‌హేష్‌ను ఇంత యంగ్‌గా ఉన్నావేంట‌య్యా బాబు అన్న ప్ర‌శ్న‌కు మ‌హేష్ త‌ల‌వంచుకుని సిగ్గు ప‌డ్డాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ నాదో చిన్న కోరిక‌.. నా డైలాగ్ నీ గొంతులో వినాల‌ని ఉంద‌య్యా అంటే.. మీ డైలాగ్ మీరు త‌ప్పా ఇంకెవ్వ‌రు చెప్ప‌లేర‌ని చెప్పాడు. చిన్న‌ప్పుడు నువ్వు చాలా నాటు కిడ్‌వి అని విన్నాను అని కూడా బాల‌య్య మ‌హేష్ చిన్న‌నాటి విష‌యాల‌ను ట‌చ్ చేశాడు.

చేసేవ‌న్ని చేస్తావ్‌.. మ‌ళ్లీ సిగ్గుప‌డ‌తావ్ చెప్ప‌కుండా… అన‌డంతో పాటు 2007 అతిథి త‌ర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకోవ‌డంపైనా బాల‌య్య ప్ర‌శ్నించాడు.. ఈ మూడేళ్లు త‌న‌ను తాను క‌రెక్ట్ చేసుకోవ‌డానికి తీసుకున్నాన‌ని మ‌హేష్ చెప్పాడు. ఇక మ‌హేష్ పెళ్లి గురించి కూడా ప్ర‌శ్నించిన బాల‌య్య‌.. అంత సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ‌న్న ప్ర‌శ్న‌కు కూడా మ‌హేష్ సిగ్గుప‌డ్డాడు..ఈ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు స్ట్రీమింగ్ అవుతుంద‌ని చెప్పారు. ప్రోమోతోనే ఆస‌క్తి రేపిన ఈ ఎపిసోడ్ పూర్తిగా స్ట్రీమింగ్ అయితే మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news