Moviesబాప్‌రే..క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ ఆస్తి అన్నీ కోట్లా..సెంచరి దాటేసిందిగా ..!

బాప్‌రే..క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ ఆస్తి అన్నీ కోట్లా..సెంచరి దాటేసిందిగా ..!

ప్రముఖ నటి హేమ గురించి మనకు అందరికి తెలిసిందే. ఎప్పుడు సరదాగా ఉంటూ ఫన్నీ జోక్స్ తో తను నవ్వుతూ తన చుట్టు పక్కన ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. ఆమె షూటింగ్ సెట్ లో ఉండే ఆ జోష్ నే వేరు..ఓ పండగలా ఉంటాది..తెలిసిమ్న వారిని తెలియని వారిని అందరిని పలకరిస్తూ కలుపుకోపోతుంది అంటారు ఆమెతో పనిచేసే నటీనటులు. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా హేమకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా బడా హీరోల సినిమాలో అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించింది.

ఏ పాత్ర చేసిన అందులో లీనమైపోయి చేస్తుంది హేమ. అంతేకాదు టేకులు కూడా ఎక్కువ తీసుకోదట. ఒక్కసారి డైలాగ్ చదువుకుని.. ఏటువంటి టేకు లేకుండా పూర్తి డైలాగ్ ను చెప్పేస్తుందట. అంతటి టాలెంటెడ్ నటీ ఈ హేమ. తాను ఈ పాత్రనే చేయాలి అని గిరిగీసుకోదట హేమ. ఏ పాత్రైనా చేస్తాను అయితే ఆమె పాత్ర చూసి నలుగురు సరదాగా నవ్వుకోవాలి లేదంటే ఏ విషయాని అయినా నేర్చుకోవాలి అంతే కానీ తిట్టుకోకూడదు అంటుంది హేమ. ఆల్ మోస్ట్ ఆల్ అందరి హీరో సినిమాల్లో నటించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని..సుమారు వంద కోట్ల ఆస్తి ఉందని..ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది. ఇక ఇదే విషయం పై ఆమె స్పందిస్తూ..క్లారిటీ ఇచ్చింది. హేమ మాట్లాడుతూ..”వందల కోట్లైతే లేవు గానీ ఉన్నవరకు బాగానే ఉన్నాయని, తన కూతురిని సెటిల్ చేసేంత సంపాదించానని చెప్పింది.

కష్టపడి నాలుగు రూపాయిలు సంపాదించుకుంటానే కానీ తప్పుడు పనులు తలవంచే పనులు మాత్రం చేయనని చెప్పింది. దేవుడి దయ వల్ల సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఒక్కప్పుడు వేలు..ఇప్పుడు లక్షల్లో పారితోషకాని తీసుకుంటున్నా ” అంటూ ఓపెన్ గా చెప్పేసింది. ఇక తాను సంపాదించిన ప్రతి రూపాయిని తన కూతురు కోసం దాచుతున్నాను అని..నాకు డబ్బును ఎలా వాడాలో ..ఎలా పొదుపు చేయాలో బాగా తెలుసని కూడా చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి హేమ తన కూతురు కోసం బాగానే వెనకెసుకున్నట్లు ఉంది అంటున్నారు నెటిజన్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news