Moviesహీరోయిన్‌గా శృతీహాస‌న్ సంపాద‌న ఎంత‌.. ఇంత ఆస్తి వెన‌కేసుకుందా..!

హీరోయిన్‌గా శృతీహాస‌న్ సంపాద‌న ఎంత‌.. ఇంత ఆస్తి వెన‌కేసుకుందా..!

సీనియ‌ర్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె అయిన శృతీహాస‌న్ సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో సిద్ధార్థ్ హీరోగా వ‌చ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి చాలా త‌క్కువ టైంలోనే స్టార్ హీరోల‌తో న‌టించి టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆమె కెరీర్ టాప్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమ‌లు, గీమ‌లు, బాలీవుడ్ ఛాన్సులు అన్న రాంగ్ స్టెప్పులువేసి ఉండ‌క‌పోతే శృతి కెరీర్ ఇంకా టాప్ పొజిష‌న్లేనే ఉండేది. ఓ విదేశీయుడితో స‌హ‌జీవ‌నం చేసిన ఆమె కెరీర్‌ను ట్రాక్ త‌ప్పించేసింది.

ఆ త‌ర్వాత ఆమె బాడీ షేప్ మారిపోవ‌డంతో పాటు ఆమె ఛ‌రిష్మా అంతా పోయింది. తిరిగి శృతి సినిమాల్లోకి వ‌చ్చినా మునుప‌టిలా అవ‌కాశాలు అయితే లేవు. తాజాగా ఆమె బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ప్ర‌భాస్ ప‌క్క‌న కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌లార్ సినిమాలోనూ న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి బెస్ట్ సెల్ల‌ర్ వెబ్ సీరిస్ చేసింది. ఈ వెబ్ సీరిస్ ప్ర‌మోష‌న్ల‌లో శృతీహాస‌న్ తాను సినిమాల్లో సంపాదించిన ఆస్తుల వివ‌రాలతో పాటు కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.

ఈ ప్ర‌మోష‌న్ల‌లో ఓ రిపోర్ట‌ర్ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత ఆస్తి సంపాదించారు ? అన్న ప్ర‌శ్న వేస్తే దానికి శృతి స్పందిస్తూ తాను ఇప్ప‌టి వ‌ర‌కు సంపాదించిన ఆస్తుల గురించి తెలుసుకునే ప‌నిలో ఉన్నాన‌ని.. వాటి విలువ ప్ర‌స్తుతం ఉన్న దానికంటే చాలా ఎక్కువ కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పింది. త‌న‌కు తెలిసి ఆస్తుల విలువ ఆరు మిలియ‌న్ డాల‌ర్లు.. అంటే రు. 45 కోట్ల పైనే ఉండ‌వ‌చ్చ‌ని ఓపెన్‌గానే చెప్పేసింది.

అయితే శృతి చెప్పిన‌దానికంటే కూడా ఆమె ఆస్తుల విలువ అంత‌కంటే ఎక్కువే ఉంటుంద‌ని టాక్ ? ఇక శృతి భాయ్ ఫ్రెండ్ శాంత‌ను హ‌జారికా గురించి కూడా ఆమె స్పందించింది. చాలా మంది నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా తెలుసుకునేందుకు ఇంట్ర‌స్ట్‌తో ఉన్నారు. నా భాయ్ ఫ్రెండ్ డూడుల్ ఆర్టిస్ట్ అని చెప్పింది. ఇక శృతి – హ‌జారికా యేడాదిగా రిలేష‌న్‌లో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news