Moviesత‌న పెళ్లిపై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌.. ప్రేమ‌కు ఇంత గొప్ప మీనింగ్...

త‌న పెళ్లిపై ర‌ష్మిక సంచ‌ల‌న కామెంట్స్‌.. ప్రేమ‌కు ఇంత గొప్ప మీనింగ్ చెప్పిందే..!

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక కేవ‌లం తెలుగుతో పాటు త‌న సొంత భాష క‌న్న‌డంలోనూ, అటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు సౌత్ టు నార్త్ ప్ర‌తి ఒక్క స్టార్ హీరో ర‌ష్మిక‌తో క‌నీసం ఒక్క సినిమా అయినా చేయాల‌ని తాప‌త్ర‌య ప‌డుతోన్న ప‌రిస్థితి. త‌మ సినిమాల కోసం వారే స్వ‌యంగా ర‌ష్మిక‌ను రిక‌మెండ్ చేస్తున్నారు. వ‌రుస ఆఫ‌ర్లు, సూప‌ర్ హిట్ల‌తో ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ కూడా కొండెక్కి కూర్చొంది.

ఇప్పుడు ర‌ష్మిక ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల‌కు త‌గ్గ‌కుండా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోన్న ప‌రిస్థితి. తాజాగా ర‌ష్మిక న‌టించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్‌లో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ర‌ష్మిక‌కు ఇప్ప‌టికే క‌న్న‌డంలో ఓ హీరోతో ప్రేమాయ‌ణం న‌డిచింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా త‌న‌తో ఒక‌టి రెండు హిట్ సినిమాలు చేసిన హీరోతో ఆమె ప్రేమ‌లో ఉంద‌న్న వార్త‌లు కొంత‌కాలంగా చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా ఆమె పెళ్లి గురించి మాట్లాడుతూ మ‌నం ఎవ‌రి ద‌గ్గ‌ర సెక్యూర్‌గా ఉంటామో.. చాలా కంపర్ట్‌గా అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటూ.. స్నేహంగా ఉంటామో.. అత‌డే మ‌న జీవితానికి మంచి లైఫ్ పార్ట్‌న‌ర్ అవుతాడ‌ని.. అలాంటి వ్య‌క్తే త‌న‌కు భ‌ర్త‌గా కావాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పుకొచ్చింది. ఇక ప్రేమ‌, పెళ్లి కూడా ర‌ష్మిక గొప్ప అర్థం చెప్పింది. ఇద్ద‌రు వ్య‌క్తులు స‌మానంగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్న‌ప్పుడే ప్రేమ సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పింది.

ఇలా ఒక‌రినొక‌రు అర్థం చేసుకోలేన‌ప్పుడు అది వ‌న్ సైడ్ ల‌వ్‌గానే ఉంటుంద‌ని.. అలాంటి ప్రేమ‌కు అర్థం లేద‌ని ఆమె చెప్పింది. ఇక తాను ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించే చేసుకుంటానంటూ త‌న మ‌న‌సులో మాట చెప్పుకువ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news