Movies' భీమ్లానాయ‌క్ ' క‌లెక్ష‌న్స్‌... మోత‌మోగుతోన్న బాక్సాఫీస్‌

‘ భీమ్లానాయ‌క్ ‘ క‌లెక్ష‌న్స్‌… మోత‌మోగుతోన్న బాక్సాఫీస్‌

టాలీవుడ్ సినీ అభిమానుల‌తో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు గ‌త కొంత కాలంగా ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న భీమ్లానాయ‌క్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఇప్ప‌టికే మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్‌కు రీమేక్‌.

నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రు. 108 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో ట్రేడ్ స‌ర్కిల్స్‌, టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో భారీ అంచ‌నాలు ఏర్ప‌రుచుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే భీమ్లాకు రోరింగ్ రెస్పాన్స్ మొద‌లైంది. 2020 అక్టోబ‌ర్‌లో షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఈ రోజు వ‌ర‌కు మేక‌ర్స్ పెట్టిన ఎఫ‌ర్ట్ అంతా ఈ రోజు సాలిడ్ రెస్పాన్స్ రూపంలో వాళ్ల‌కు ల‌భించింది.

ఫ‌స్ట్ డే వ‌స్తోన్న టాక్ ప్ర‌కారం చూస్తే సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక అమెరికాలో కేవ‌లం బుకింగ్స్ ద్వారానే హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసేసి $666,827 డాల‌ర్ల వ‌సూళ్ల‌ను భీమ్లా ఇప్ప‌టి వ‌ర‌కు రాబ‌ట్టింది. ఇక ఫ‌స్ట్ డే ముగిసే స‌రికే ఈ సినిమా ఈజీగా మిలియ‌న్ మార్క్ వ‌సూళ్ల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం లేదా క్రాస్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మొత్తం 309 లొకేష‌న్ల నుంచి ఈ వ‌సూళ్లు కేవ‌లం బుకింగ్స్ ద్వారానే వ‌చ్చాయి. అలాగే ఈ బుకింగ్స్ ఇప్పుడు భీమ్లానాయ‌క్‌ను అమెరికా బాక్సాఫీస్ బుకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్‌లో నిలిపాయి. ఏదేమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది త‌ర్వాత ఆ స్థాయిలో అప్లాజ్ ఈ సినిమాకు వ‌చ్చింది. ఓవ‌ర్సీస్‌లో బాక్సాఫీస్ మోత మోగిస్తోన్న ప‌వన్ ఏపీ, తెలంగాణ‌లోనూ కుమ్మేశాలా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news