Moviesచిరంజీవి పాత టైటిల్స్‌తో మ‌ళ్లీ వ‌చ్చిన సినిమాలు ఇవే..!

చిరంజీవి పాత టైటిల్స్‌తో మ‌ళ్లీ వ‌చ్చిన సినిమాలు ఇవే..!

ప్ర‌స్తుతం ఓ సినిమా జ‌నాల్లోకి దూసుకుపోయేలా టైటిల్ పెట్టాలంటే మేక‌ర్స్‌కు చాలా క‌ష్టం అయిపోతోంది. దీంతో పాత సినిమాల టైటిల్స్‌ను మ‌ళ్లీ పెడుతున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 20 సినిమాల టైటిల్స్‌నే మ‌ళ్లీ వాడారు. అయితే చిరు టైటిల్స్ మ‌ళ్లీ వాడుకున్నా అవి పెద్ద‌గా క‌లిసి రాలేదు. చిరు ఆ రోజుల్లో ఆ సినిమాలు చేసిన‌ప్పుడు అవి క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్నాయి. త‌ర్వాత ఆ టైటిల్ రిపీట్ అయినా.. ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. చిరు టైటిల్స్‌తో మ‌ళ్లీ తెర‌కెక్కిన సినిమాల‌పై ఓ లుక్కేద్దాం.

1- స్టేట్ రౌడీ:
1989లో చిరంజీవి హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా వ‌చ్చింది. అయితే 2007లో శివాజీ ఇదే టైటిల్‌తో సినిమా చేస్తే ప్లాప్ అయ్యింది.
2- యముడికి మొగుడు:
1988లో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరు నటించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇది. ఆ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ హీరోగా ఇ. స‌త్తిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఇదే టైటిల్‌తో వ‌చ్చిన సినిమా ప్లాప్ అయ్యింది.

3- గూడఛారి:
ఇదే టైటిల్‌తో సూప‌ర్‌స్టార్ కృష్ణ కొన్ని సినిమాలు చేశారు. త‌ర్వాత చిరంజీవి 1983లో గూడఛారి నెం.1 పేరుతో ఓ సినిమా చేశారు. అడ‌వి శేష్ 2018లో గూఢ‌చారి టైటిల్‌తో సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు దీనికి సీక్వెల్ వ‌స్తోంది. ఇక అర్జున్ కూడా గూఢ‌చారి నెంబ‌ర్ 1 పేరుతో ఓ డ‌బ్బింగ్ సినిమా చేసినా అది కూడా ప్లాప్ అయ్యింది.
4- పున్నమి నాగు:
1980లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి నెగిటివ్ పాత్ర చేశాడు. త‌ర్వాత మ‌మైత్ ఖాన్ – రాజీవ్ క‌న‌కాల కాంబోలో కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఇదే టైటిల్‌తో వ‌చ్చిన సినిమా ప్లాప్ అయ్యింది.

5- మగధీరుడు:
1986లో విజయ బాపినీడు దర్శకత్వంలో చిరు హీరోగా ఈ సినిమా వ‌చ్చింది. అయితే ఆ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ రెండో సినిమాగా వ‌చ్చిన మ‌గ‌ధీర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌.
6- హీరో:
హీరో టైటిల్‌తో అప్ప‌టికే కొన్ని సినిమాలు రాగా.. 1984లో విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా హీరో వ‌చ్చింది. ఇది యాక్ష‌న్ సినిమా. ఆ త‌ర్వాత నితిన్ హీరోగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ జీవా ద‌ర్శ‌క‌త్వంలో హీరో వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక శివ కార్తీకేయ‌న్ హీరోగా ఓ త‌మిళ సినిమాను హీరో పేరుతో రిలీజ్ చేశారు. ఇక తాజాగా సంక్రాంతికి మ‌హేష్‌బాబు మేన‌ళ్లుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ టైటిల్ కూడా హీరోయే. ఇవేవి ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు.

7- గ్యాంగ్ లీడర్:
విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో చిరు హీరోగా ఈ సినిమా వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా ఇదే టైటిల్‌తో వ‌చ్చిన సినిమాకు మంచి మార్కులు ప‌డినా క‌మ‌ర్షియ‌ల్‌గా క్లిక్ కాలేదు.
8- రాక్షసుడు:
ఏ కోదండరామిరెడ్డితో కలిసి చిరంజీవి చేసిన సినిమా సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఓ రీమేక్ సినిమాకు ఇదే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా మ‌రో సినిమా వ‌స్తోంది.

9- విజేత:
1985లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన విజేత సూప‌ర్ హిట్‌. ఇక తాజాగా మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ డెబ్యూ మూవీ టైటిల్ కూడా విజేతే. ఇది ప్లాప్‌.
10- ఖైదీ:
1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవిని మెగాస్టార్‌ను చేర్చింది. ఆ త‌ర్వాత త‌మిళ హీరో కార్తీ హీరోగా వ‌చ్చిన ఖైదీ కూడా హిట్ అయ్యింది. ఇక చిరు ఖైదీ క‌లిసి వ‌చ్చేలా ఖైదీ 786 – ఖైదీ నెం.150 సినిమాలు చేశాడు.

11- దొంగ:
కోదండరామిరెడ్డితో చిరంజీవి చేసిన దొంగ సూప‌ర్ హిట్‌. త‌ర్వాత కార్తీ త‌న సినిమాకు ఈ టైటిల్ వాడుకున్నా వ‌ర్క‌వుట్‌కాలేదు.
12- మాస్టర్:
1997లో సురేష్ కృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌. త‌ర్వాత విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కించిన మాస్ట‌ర్ అన్ని భాష‌ల్లోనూ హిట్ అయ్యింది.

13- ముగ్గురు మొనగాళ్లు:
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి త్రిబుల్ రోల్ చేసిన ఈ సినిమా త‌ర్వాత క‌మెడియ‌న్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా ఇదే టైటిల్‌తో వ‌చ్చిన సినిమా ప్లాప్ అయ్యింది.
14- రాజా విక్రమార్క:
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా హిట్‌. ఇక ఈ టైటిల్‌తో కార్తీకేయ హీరోగా వ‌చ్చిన సినిమా ప్లాప్‌.

15- మేజర్:
చిరంజీవి – రవిచంద్రన్ – సౌందర్య ప్రధాన పాత్రల్లో రూపొందించిన కన్నడ సినిమా ఇది. ఇక ఇప్పుడు అడ‌విశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వంలో మేజ‌ర్ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది.
16- ప్రాణం ఖరీదు:
1978లో చిరంజీవి నటించిన మొదటి సినిమా ఇది. ఇదే టైటిల్‌తో వ‌చ్చిన ఈ సినిమా ప్లాప్‌.

17- బిల్లా రంగా:
కెఎస్ఆర్ దర్శకత్వంలో చిరంజీవి – మోహన్ బాబు హీరోలుగా న‌టించిన హిట్ సినిమా. ఇదే టైటిల్‌తో మ‌రో సినిమా వ‌చ్చినా ఇది ప్లాప్‌.
18- రుద్రవీణ:
1988లో కె బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన క్లాసిక్ సినిమా ఇది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ర‌ఘు కుంచె కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news