Moviesశివ‌జ్యోతి గ్లామ‌ర్ డోస్ పెంచేసిందా... ఫొటో వైర‌ల్‌...!

శివ‌జ్యోతి గ్లామ‌ర్ డోస్ పెంచేసిందా… ఫొటో వైర‌ల్‌…!

తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి అంటే తెలుగు జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తీన్మార్ సావిత్రిగా బిత్తిరి సత్తితో కలిసి తెలంగాణలో ఆమె చేసే అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శివజ్యోతి తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు వేసే సెటైర్లకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె క్రేజ్ డ‌బుల్ అయింది. బిగ్‌బాస్ లోకి వెళ్లి వచ్చాక శివ‌జ్యోతి స్పీడ్ మామూలుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత ఆమె బయట ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఓ సెలబ్రిటీ గా మారిపోయారు.

అలాగే తన గత జీవితంతో పాటు తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఇక తన భర్త గంగూలి గురించి ఆమె ఎప్పటికప్పుడు తన ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది. శివ జ్యోతి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఎన్నో విషయాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆమెకు మరింత క్రేజ్‌ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమెకు రోజురోజుకూ ఫ్యాన్స్‌ పెరుగుతున్నారు. తీన్మార్ సావిత్రి అంటే మనకు అచ్చతెలుగు ఆడపడుచు రూపం గుర్తుకువస్తుంది. అందమైన చీర కట్టు – చేతికి గాజులు, నుదుటిపై బొట్టు, ముక్కుపుడక పెట్టుకొని ఆమె ఎంతో అందంగా కనిపిస్తుంది.

అయితే ఇప్పుడు ఆమె గ్లామ‌ర‌స్ ఫొటోలు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం మొద‌లు పెట్టింది. ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. న‌లుపు రంగు ఫ్రాక్ ధ‌రించిన ఈ డ్రెస్సులో పైన అంతా నెట్ మాదిరిగా ఉంది. దీంతో ఆమె కూడా గ్లామ‌ర్ ఇమేజ్ కోరుకుంటోందా ? అన్న సందేహాలు కొంద‌రు నెటిజ‌న్లు వ్య‌క్తం చేశారు.

 

దీంతో చాలా మంది ఈ ఫోటోకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ఇలాంటి డ్రెస్సులు వేసి మీ విలువ త‌గ్గించుకోవ‌ద్ద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఎంతో సంప్ర‌దాయంగా ఉండే శివ‌జ్యోతి ఒక్క‌సారిగా గ్లామ‌ర్ డోస్ పెంచేలా ఈ కొత్త డ్రెస్సుల‌తో క‌న‌ప‌డ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యంగా ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news