Moviesఆ టాప్ క‌మెడియ‌న్‌తో హీరోయిన్‌ రాధిక ప్రేమాయ‌ణం నిజ‌మేనా...!

ఆ టాప్ క‌మెడియ‌న్‌తో హీరోయిన్‌ రాధిక ప్రేమాయ‌ణం నిజ‌మేనా…!

ఒకప్పుడు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు సుధాకర్. సుధాకర్ సుధాకర్ న‌ట‌న మానేసి చాలా యేళ్లు అయినా కూడా ఆయ‌న పాత్ర‌లు ఎప్పటికీ ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. సుధాకర్ తెలుగు వ్యక్తి అయినా కూడా సౌతిండియాలోని అన్ని భాషల్లో నటించాడు. దాదాపు పదేళ్లకు పైగా 600 ఎన్నో వైవిధ్యమైన పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. విలన్ గానూ మెప్పించాడు. సుధాకర్ తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించాడు. సీనియర్ హీరోయిన్ రాధికతో సుధాకర్ 18 సినిమాలు చేశాడు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది.

సహజంగానే ఒక హీరో – హీరోయిన్ కలిసి నటించిన సినిమా హిట్ అయిందంటే అదే జంటతో వరుసగా సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతుంటారు. అప్పుడు సహజంగానే వారిద్దరి మధ్య ప్రేమ… గీమ ఉందంటూ ఒకటే గాసిప్‌లు వస్తాయి. అలాంటిది సుధాకర్ – రాధిక ఏకంగా ఒకటి కాదు… రెండు కాదు 18 సినిమాల్లో నటించారంటే వారిద్దరి గురించి ఏ రేంజ్ లో వార్తలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాధిక అయితే ఏకంగా సుధాకర్‌ను ఇష్టంగా ప్రేమించి పెళ్లి కూడా చేసుకోబోతుంద‌నే వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై సుధాకర్ క్లారిటీ ఇచ్చాడు. తనకు 1983లోనే పెళ్లి అయిందని… తాను, రాధిక‌ ప్రేమలో ఉన్నామ‌ని… తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు భయంకరమైన రూమర్లు వచ్చాయనీ… ఆ రూమర్లను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని సుధాకర్ చెప్పాడు. ఇక తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్పిన సుధాకర్… తాను కాఫీ ఇష్టంగా తాగుతాను అని చెప్పాడు.

తనకు బీరు తాగే అలవాటు మాత్రమే ఉందని… అది కూడా ఒక గ్లాసు మాత్రమే తీసుకుంటానని… తన ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని… అయినా నా ఆరోగ్యం చెడిపోయింది…. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. చావు అంచులు వరకు వెళ్లి వచ్చానని… ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పట్లో రాధిక – సుధాకర్ జంటకు మంచి క్రేజ్ ఉండేది. ఇక రాధిక ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకుల త‌ర్వాత ఇప్పుడు శరత్ కుమార్‌తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news